ఆడే పద్ధతిః- ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.