- ఆరోగ్య సూత్రాలు -
ఆరోగ్యమే మహాభాగ్యము
ఆరోగ్యమే మహాభాగ్యము
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.
ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు
బరువు (వయస్సు ప్రకారం) :
శారీరక ఉష్ణోగ్రత :
గుండె లయ (హార్ట్ బీట్) :
నాడీ లయ (పల్స్ రేట్) :
రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) :
మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :
దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక , సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం, అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది, వ్యక్తి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.
ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు
పౌష్టికాహారం :
సమతుల్యాహారం :
శారీరక వ్యాయామం :
మానసిక వ్యాయామం :
ధ్యానం :
అనారోగ్యము
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, స్వల్పంగా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని వ్యాధి లేక అనారోగ్యము అని నిర్వచించవచ్చు .
ఎరుపు రంగులో చూడచక్కగా ఉండే దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉంటాయి. అనేక పోషకాలకు నిధిగా దానిమ్మ పండ్లను చెప్పవచ్చు. ఫైబర్, ఫొలేట్, పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి, కె తదితర పోషకాలు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దానిమ్మ పండ్లను తరచూ తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా చూసుకోవచ్చు.
1. దానిమ్మ పండ్లను రోజూ తింటుంటే రక్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. దీని వల్ల గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
2. కీళ్ల దగ్గర వాపులు తీవ్రంగా వస్తే కీళ్ల నొప్పుల సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలన్నా, ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం దానిమ్మ పండును తినాలి. లేదా ఆ పండు జ్యూస్ తాగాలి.
3. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నందున క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు.
4. హైబీపీ ఉన్నవారు నిత్యం దానిమ్మ పండు జ్యూస్‌ను తాగాలి. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల బాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
5. నిత్యం వ్యాయామం చేసేవారికి దానిమ్మ పండ్ల జ్యూస్ మంచి శక్తినిస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంతోపాటు పోషకాలను కూడా అందిస్తుంది.
ప్రస్తుతం డయాబెటీస్ సమస్య అందరినీ వేధిస్తోంది. అన్ని రకాల వయస్సు వారు మధుమేహం బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం డయాబెటీస్ కు దారి తీస్తోంది. అయితే అమెరికాకు చెందిన టఫ్ట్స్ యూనివర్సిటీ తాజాగా జరిపిన పరిశోధనల్లో వాల్ నట్స్, సోయాబీన్స్ తరచూ తీసుకుంటే డయాబెటీస్ దూరమవుతోందని తేలింది. ఈ విషయాన్ని ఆ యూనివర్సిటీ పీఎల్ఓఎస్ మెడికల్ జర్నల్ లో వెల్లడించింది.
డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు, ఎండు ద్రాక్షలో అనేక న్యూట్రీషియన్స్ ఉంటాయి . అన్ని రకాల డ్రైట్స్ లో కంటే ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు ఎక్కువ. వీటిలోని పోషకవిలువలు తెలియక చాలా మంది వీటిని విస్మరిస్తుంటారు. వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే కనుక రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకుంటారు.
అయితే ఎండు ద్రాక్షను ఫ్రూట్ సలాడ్స్, స్వీట్స్ తయారీలో, వంటల్లో కాకుండా నేరుగా తినడం కంటేనూ, వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు . నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను రెట్టింపుగా ఉంటాయి . ఒక గ్లాసులో 8 నుండి 10 ఎండు ద్రాక్షలను వేసి నానబెట్టాలి. వీటి ఉదయం మిక్సీలో వేసి బ్లెడ్ చేయాలి. ఈ నీటిలో పరగడున తాగాలి. ఇలా చేయడం వల్ల అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్స్ అధికంగా ఉంటాయి . అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఎండు ద్రాక్షలో అనేచురల్ షుగర్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. ఎండు ద్రాక్షలో కూడా వివిధ రకాలున్నాయి. వాటిలో గోల్డెన్, గ్రీన్ మరియు బ్లాక్ కలర్స్ ఇలా వివిధ రకాలుగా ఉన్నాయి.
వివిధ రకాల డిష్ లలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అంతే కాదు, కొన్ని హెల్త్ టానిక్స్ లో కూడా ఎండు ద్రాక్షరసాన్ని వినియోగిస్తుంటారు. అయితే ఎండు ద్రాక్షలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం మంచిది. నీళ్లలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
జీర్ణశక్తిని పెంచుతుంది:
ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా మెరుగుపడుతుంది. ఒక గ్లాసు నీటిలో `10 నుండి 12 ఎండు ద్రాక్షలను వేసి, రాత్రంతా నానబెట్టాలి. వీటిని మిక్సీలో పేస్ట్ చేసి ఉదయం నేరుగా పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణశక్తిపెరుగుతుంది.
వ్యాధినిరోధకత పెరుగుతుంది:
ఎండు ద్రాక్షలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటి లెవల్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వింటర్ సీజన్ లో వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.
బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తుంది :
ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాడ్ బ్రీత్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో ఎండు ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది.
ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది:
ఎండు ద్రాక్షలో క్యాల్షియం మరియు మైక్రో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి బోన్ హెల్త్ ను మెరుగుపరచడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.
అనీమియా :
ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టి, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల అనీమియా సమస్య ఉండదు.
లివర్ :
శరీరంలో టాక్సిన్స్ ను నివారించడంలో ఎండు ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది:
ఎండు ద్రాక్షలో ఫైబర్ కంటెంట్ తో పాటు ఇతర న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది.
ఎనర్జీని అందిస్తుంది:
ఎండు ద్రాక్షలో ఉండే నేచురల్ ఫ్రక్టోజ్ ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఎండు ద్రాక్షను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, వీక్ నెస్ ను తగ్గిస్తుంది. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
ఎండు ద్రాక్షను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలను నివారిస్తుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది :
ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్, అన్ని రకాల న్యూట్రీషియన్స్ ను కంటి చూపును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
విటమిన్ ‘ఇ’ తప్పనిసరిగా ఆహారంలో ఉండాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని రకాల వంటనూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సోన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ‘ఇ’ వల్ల ఆరోగ్యానికెంతో మేలు కలుగుతుంది. విటమిన్ ‘ఇ’ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని కణాలను ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. ‘ఇ’ విటమిన్ ఉన్న పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హానికారక క్రిములు, క్యాన్సర్ కణాల బారిన పడకుండా ఇది రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముడతలు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. చూపు మందగించడం, అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ‘ఇ’ విటమిన్‌ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ‘ఇ’ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటుతో పాటు హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. అధిక బరువు సమస్య తగ్గుతుంది. ఒత్తిడిని నివారించడానికి ‘ఇ’ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది.
నేటి మారుతున్న జీవనశైలి కారణంగా చాలా సార్లు మనం ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి చిన్న సమస్యకు మందులు తీసుకోవడం మంచిది కాదు. అందువల్ల, ఇంటి వంటగదిలో ఉన్న వస్తువులను ఉపయోగిస్తే రోజువారీ జీవితంలో తలెత్తే సాధారణ సమస్యలను నివారించడం ప్రయోజనకరం. వంటగదిలో ఉండే విషయాలు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. వాటిలో లవంగం ఒకటి. లవంగం అందరికీ మేలు చేస్తుంది.
కాబట్టి పడుకునే ముందు 2 లవంగాలు తినడం మరియు వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను మాకు తెలియజేయండి-
* లవంగానికి చాలా గుణాలు ఉన్నాయి. పడుకునే ముందు వినియోగం రోజంతా కడుపుని తాజాగా మరియు శుభ్రంగా ఉంచుతుంది. ఉదయం మీ కడుపు క్లియర్ అవుతుంది. లవంగంలో మీ రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి సహాయపడే రోగనిరోధక బూస్టర్ ఉంది. అదే లవంగాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బలహీనత అధిగమించబడుతుంది.
* మీరు మీ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, పుష్కలంగా నీరు తాగడంతో పాటు మీ ఆహారాన్ని పూర్తిగా చూసుకోవాలి. లవంగంలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇది ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి కాలేయాన్ని రక్షించడానికి అనువైన medicine షధం. హెపాటో-రక్షిత లక్షణాల కారణంగా లవంగాల సారం ఈ ప్రభావాలను ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం 2 లవంగాలు తిన్న తర్వాత వెచ్చని నీరు త్రాగాలి. ఇది ఉదయం కడుపుని పూర్తిగా క్లియర్ చేస్తుంది.
* తరచుగా జలుబు లేదా జ్వరం ఉన్నవారికి రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో లవంగాల వాడకం ఉపయోగపడుతుంది ఎందుకంటే లవంగాలలో అనేక యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఇన్ఫెక్షన్లు మరియు బ్యాక్టీరియా పెరుగుదలని నివారించడంలో సహాయపడతాయి. క్రెడిట్: థర్డ్ పార్టీ ఇమేజ్ రిఫరెన్స్
* లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి, మంట సమస్య నుండి బయటపడటం, లవంగాలలో యూజీనియా అనే పదార్ధం ఉంటుంది, ఇది సమర్థవంతమైన తాపజనక ఏజెంట్‌గా మారుతుంది. ఇది గొంతు మరియు చిగుళ్ళను నయం చేస్తుంది.
* లవంగాల వినియోగం కూడా దుర్వాసన ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పడుకునే ముందు రాత్రి రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది కడుపుని సరిగ్గా శుభ్రపరుస్తుంది మరియు దుర్వాసనను తొలగిస్తుంది. మీకు కావాలంటే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు లవంగం ముక్కను నోటిలో ఉంచండి. దీనితో, వాసన సమస్య తొలగిపోతుంది. చెడు శ్వాస ఉన్నవారికి లవంగాల వినియోగం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పడుకునే ముందు రాత్రి రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది కడుపుని సరిగ్గా శుభ్రపరుస్తుంది మరియు దుర్వాసనను తొలగిస్తుంది. మీకు కావాలంటే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు లవంగం ముక్కను నోటిలో ఉంచండి. దీనితో, వాసన సమస్య తొలగిపోతుంది. ఇది కడుపుని సరిగ్గా శుభ్రపరుస్తుంది మరియు దుర్వాసనను తొలగిస్తుంది. మీకు కావాలంటే, మీరు బయటకు వెళ్ళేటప్పుడు లవంగం ముక్కను నోటిలో ఉంచండి. దీనితో, వాసన సమస్య తొలగిపోతుంది.
ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం:
ఫాస్ట్‌పుడ్ వల్ల యువకులు కూడా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్పెయిన్‌లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో 48 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని తేలింది. దాదాపు 9000 మందిని ఆరేళ్లు పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించారు. మనం తీసుకునే ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, గ్రీస్ మరియు ఇరాన్ పరిశోధనల యొక్క మెటా విశ్లేషణ ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతారని తేలింది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో ఫాస్ట్‌పుడ్ తీసుకుంటే డిప్రెషన్ ప్రమాదాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి తగ్గాలంటే..
► ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
►తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
►నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజ్లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది.
►ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కనుక వీటిని తగ్గించుకోవాలంటే నిత్యం తగినంత సమయం పాటు నిద్రపోవడం తప్పనిసరి.
►నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.
►ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది.
అవిసె గింజలు ఇవి ఆరోగ్యానికి దివ్య ఔషదాలు. రోజూ వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి..అవిసె గింజలను చారెడు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందంటున్నారు తాజా అధ్యయనాలు జరిపిన పరిశోధకులు.
శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అరుదుగా లభిస్తుంటాయి..కానీ ఈ అవిసె గింజల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి..ఇందులో పీచు పదార్ధాలు, యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే జుట్టు సమస్యలతో బాధపడేవారు కూడా రోజూ అవిస గింజలను తీసుకోవడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఇక ఊబకాయం సమస్యతో సతమతమయ్యేవారు ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అధిక బరువును తగ్గించుకోవచ్చుఇక రోజూ వీటిని తినడం అలవాటు చేసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవిసె గింజెల్లో రెండు రకాల పీచుపదార్ధాలు ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి అనేది వెయ్యదు. కాబట్టి ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగిన వారికి వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక మలబద్దకం ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు. మెదడు ఆరోగ్యినికి ఇవి తోడ్పడతాయి.. కడుపులో మంటను తగ్గిస్తాయి. చర్మ వ్యాదులు రాకుండా జాగ్రత్త పరుస్తాయి. అలాగే కొత్త చర్మ కణాలు పుట్టుకొచ్చు ముఖంలో కొత్త ఉత్తేజం పుట్టుకొస్తుంది. మరీ ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడినా, దురదలు, వాపులు, నొప్పులు రావడం, కందిపోవడం వల్ల సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది వాతావరణ కాలుష్యం కారణంగా రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టు చిట్లిపోవడం, పొడిబాడరం , రాలిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జుట్టి చిట్లిపోయే సమస్యకు అవిసె గింజలు చెక్ పెడతాయి. జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతూ ఒత్తుగా బలంగా ఉంటుంది. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు ప్రతి రోజు ఈ గింజలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని సూచిస్తున్నారు. డయాబెటిస్తో సతమతమయ్యేవారు వారు సైం వీటిని తీసుకోవచ్చు. చక్కటి ఫలితం లభిస్తుంది.
కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకట్టుకునే రంగూ, రూపం గానీ అంజీర్ కు లేవు. కాని ఇవీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అద్భుతమైన రుచితోపాటు పోషకవిలువలు కూడా పుష్కలంగా ఇందులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ రూపంలోనే అంజీర్ వాడకం ఎక్కువ. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఇవి 'అకేషనల్' నుంచి, నిత్యావసర వస్తువులుగా మారాయి. డ్రైపూట్లో ఐరన్ చాలా ఎక్కువ. కడుపు నొప్పి, జ్వరం, చెవినొప్పి, లైంగిక వ్యాధులను తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. ఎంతకాలమైనా నిలువ చేసుకో వచ్చు. దూర ప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు.
నిత్యం రెండు అంజీర్ పండ్లను భోజనానికి ముందు తిన్నట్టయితే వారిలో రక్తం బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్లెట్లు తగ్గిన వారికి ఈ పండ్లను తినిపిస్తే వెంటనే ప్లేట్లెట్లు పెరుగుతాయి. ప్రత్యేకించి అంజీర పండులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు కావలసినంత పీచుపదార్థం కూడా ఉంటుంది. అంజీరలో ఉండే పీచుపదార్ధం పెక్టిన్ వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. బరువు తగ్గడంలో పీచుపదార్థాలు చేసే మేలు అంతాఇంతా కాదు. అంజీర్‌లో అలాంటి పీచు ఎక్కువ. పేవుల్లోని గోడలకు అంటుకున్న వ్యర్థపదార్థాల్ని పీచుపదార్థం శుభ్రం చేస్తుంది. బరవుతగ్గడం తేలికవుతుంది. మొలలు ఉన్న వాళ్లు రెండు లేదా మూడు అంజీర్పళ్లను నానబెట్టి తీసుకోసుకుంటే తగ్గిపోతాయి.పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి.
కిడ్నీ స్టోన్స్‌ను తగ్గించటానికి 4-5 అంజీర పండ్లను నానబెట్టి క్రమం తప్పకుండా తింటుంటే రాళ్లు కరుగుతాయి. సరిగ్గా నిద్రలేని వారు రాత్రి ఏడు గంటల తరువాత మూడు అంజీరపు పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్ర పడుతుంది. తరచూ జలుబు చేసిందంటే ఈ అంజీరపు పళ్ళ రసం తాగితే బాగుంటుంది. ఆడపిల్లలు రోజు రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు. కొలెస్ట్రాల్‌ను తగ్గి స్తుంది. స్త్రీ - పురుషులిద్దరూ రెండు అంజీరా పండ్లు, పాలు తీసుకుంటే యవ్వనాన్ని చిరకాలం ఉంచుకోవచ్చు.
ఎదుగుతున్న పిల్లలు ఈ పండ్లను తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. తలలోని చుండ్రును నివారిస్తుంది. 3-4 అంజీరలను నానబెట్టి తలకు మర్దన చేయటం వల్ల తలలోని చుండ్రు పోతుంది. ఇన్ని ఉపయోగాలు గల అంజీరను క్రమం తప్పకుండా తినటం వల్ల చాలా లాభాలు పొందవచ్చును. కఫం బాగా పేరుకుపోవడం వల్ల వచ్చే దగ్గుతో పాటు, శ్వాసకోశ పరమైన ఇబ్బందులు, ఉబ్బసం వంటి ఇతర సమస్యల నుంచి చక్కని ఉపశమాన్ని ఇచ్చేవి ఎండు అంజీర పండ్లు. ఒకటి రెండు పండ్లను రెండు గంటల పాటు నీళ్లల్లో నానబెట్టి, ఆ తర్వాత గ్లాసు పాలల్లో వేసి మరిగించి, రోజుకు రెండు పూటలా సేవిస్తే, చాలా త్వరితంగా ఉపశమనం పొందవచ్చు. కొంత మంది కళ్లు ఏమాత్రం తేమ లేనంతగా పొడిబారిపోతాయి, కళ్లల్లో దురద, మంట కూడా రావచ్చు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే అంజీర పండ్లు కళ్లకు ఆ దృష్టిలోపాలు కూడా చాలావరకు తగ్గుతాయి. ఎండు పండ్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల హృద్రోగ నివారణకీ తోడ్పడతాయి. ఎండు అంజీరాలలో ఫెనాల్, ఒమేగ3 మరియు ఒమెగ6 ఫ్యాటీ ఆసిడ్స్ చాలాఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయట పడవచ్చు. అధిక బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి ఇది ఫర్ ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు, వారి రెగ్యులర్ డైట్ లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలిని సూచిస్తుంటారు. చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది. అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకొవచ్చు.
నార్మల్ టీ కన్నా గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరూ దాన్నే అలవాటుగా మార్చుకున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని తేలడంతో మరింత మంది తాగేందుకు మగ్గు చూపుతున్నారు. కానీ గ్రీన్ టీ కొందరు తాగితే అనారోగ్యం బారిన పడడం ఖాయం. మరి గ్రీన్ టీ ఎవరెవరు తాగకూడదో ఒకసారి చదివి తెలుసుకోండి.
ఇన్సోమ్నియా :
ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రులు ఎక్కువ సేపు మేల్కోవడం వల్ల నిద్ర తక్కువగా పోతున్నారు. ఇలాంటి వారు గ్రీన్ టీ అసలు తాగకూడదు. అలాగే ఇన్సోమ్నియాకు బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నవారు కూడా గ్రీన్ టీకు దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకు బదులుగా గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమం అంటున్నారు.
మధుమేహం :
డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు షుగర్ లేకుండా కాఫీ, టీ తాగుతుంటారు. ఇదంతా ఎందుకులే అని గ్రీన్ టీ తాగుతున్నారు. వారికి ఇది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. అయినా పట్టించుకోకుండా తాగడం వల్ల దురదలు, ఆందోళన, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఐరన్ సమస్య :
చాలామంది ఐరన్ సమస్యతో బాధపడుతుంటారు. ఆహారం నుంచి పొందే ఐరన్ శక్తిని గ్రీన్ టీ క్షీణించేలా చేస్తుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అందదు.
గర్భిణీ మహిళలు :
పిల్లలకోసం ఎదురుచూసేవాళ్లు గ్రీన్ టీ అతిగా తాగకూడదు. అలాగే గర్భంతో ఉన్న మహిళలు గ్రీన్ టీ అసలు తాగకూడదు. ఎందుకంటే ఇందులోని కెఫీన్ ఉద్దీపన రక్తంలోకి చేరి జీవక్రియ సమస్యలు ఏర్పడవచ్చు.
రక్తపోటు :
గ్రీన్‌టీలో ఉండే ఉత్తేజిత లక్షణం బీపీపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. రక్తపోటు సమస్య గనుక ఉంటే గ్రీన్‌టీ అసలు తాగకూడదు. వీలైనంత వరకు గ్రీన్ టీకి దూరంగా ఉండేలా చూసుకోండి.
జామపండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో… జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.
జామ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
శక్తివంతమైన యాంటి ఆక్సిడేంట్ గా ఉపయోగపడుతుంది.
జామపండు తినడం వల్ల గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి.
తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.
జామచెట్టు బెరడుతో కాసిన డికాషన్ తాగడం వల్ల పొట్టలోని నులిపురుగులు, ఇతర సూక్ష్మజీవులు నశిస్తాయి. తరచూ జామకాయ తినేవారికి మలబద్దక సమస్యలు ఏర్పడవు.
జామ పండు కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది.
చాలామంది బలహీనంగా ఉంటుంటారు. ఇలాంటి వారు జామలోని గింజలను తీసి ఆ గుజ్జును పాలు, తేనెతో కలిపి తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు.
ఇందులోని విటమిన్ ‘సి’, క్యాల్షియం శారీరకంగా దృఢంగా మారుస్తుంది.
రోజూ రెండు, మూడు లేత జామ ఆకులు నమిలితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
జామ తినడం వల్ల క్షయ, ఉబ్బసం, బ్రాంకైటీస్, గుండె బలహీనత, కామెర్లు, హెపటైటిస్, జీర్ణాశయపు అల్సర్లు, మూత్రంలో మంట వంటి సమస్యలు దూరం అవుతాయి.
జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది.
నోటి సమస్యలు, చిగుళ్లు, దంత సమస్యలతో బాధపడే వారు తరచూ జామకాయలు తింటే ఆ సమస్యల్ని దూరం చేసుకున్న వారవుతారు.
కాలిన గాయాలతో బాధపడే వారు గుజ్జును ఆ ప్రాంతంలో రాయడం వల్ల ఉపశమనం పొందుతారు.
మహిళల్లో గర్భ సమయంలో వాంతుల సమస్య ఎదురవుతుంది. అలాంటప్పుడు జామ చాలా బాగా పనిచేస్తుంది.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలామంచిదని మనందరికీ తెలుసు. అయితే వీటిని తేనెలో వారంరోజులు పాటు నానబెట్టి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..ఖర్జూరం తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు దగ్గు, జలుబు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న కంటైనర్‌లో మూడొంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వెయ్యాలి. వీటిని బాగా కలిపి, మూతపెట్టి వారం కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి, రెండు చొప్పున ఈ ఖర్జూరాలను తినొచ్చు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు. నిద్రలేమితో బాధపడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతాం. ఒత్తిడిని దూరమవుతుంది. ఈ మిశ్రమంలోని యాంటీ బయాటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానతాయి. మెమోరీపవర్ పెరుగుతుంది. చిన్నారులు చదువుల్లో చురుగ్గా ఉంటారు. ఈ మిశ్రమంలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలంగా మారుస్తుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలు తింటే ఫలితం ఉంటుంది.
ఆవాలతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి కాబట్టే వాటిని తాలింపులో విరివిగా వాడుతూ ఉంటాం. అలాంటి ఆవాల నుంచి తీసిన ఆవనూనెని వంటల్లో వాడటం వల్ల కలిగే ప్రయోజనం రెండింతలు ఉంటుంది. అందుకే ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఆవనూనె ఎక్కువగా వాడతారు.
న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్:
ఆవనూనె - 100గ్రా, కెలోరీలు - 884
మొత్తం కొవ్వు - 153ు, దీన్లో శాచురేటెడ్ ఫ్యాట్ - 12గ్రా (60ు)
పాలీ శాచురేటెడ్ ఫ్యాట్ - 21గ్రా, మోనో శాచురేటెడ్ ఫ్యాట్ - 59గ్రా
ఆవాల నుంచి 2 నూనెలు:
ఆవాలను ఒత్తి వాటి నుంచి కొవ్వుతో కూడుకున్న ‘వెజిటబుల్ ఆయిల్’, నీళ్లతో కలిపి నూరి ‘ఎసెన్షియల్ ఆయిల్’- ఇలా రెండు రకాల నూనెలు తయారు చేస్తారు. మొదటిది వంటల్లోకి, రెండవది సౌందర్య సాధనాల్లోకి ఉపయోగిస్తారు. వెజిటబుల్ ఆయిల్ కాస్త ఘాటుగా ఉంటుంది. అందుకే అందరూ ఈ నూనెను వంటల్లో వాడటానికి ఇష్టపడరు. అయితే దీన్లోని ఒమేగాఆల్ఫా3, ఒమేగాఆల్ఫా6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటిఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఆరోగ్యపరమైన ప్రయోజనాలు:
వంటల్లో ఆవనూనె వాడకం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నూనె వాడకం వల్ల బ్యాడ్ కొలెస్టరాల్ తగ్గి గుడ్ కొలెస్టరాల్ పెరుగుతుంది. అలాగే ట్రైగ్లిసరైడ్స్, రక్తంలోని కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం దరి చేరదు.
ఆవనూనె వాడకం వల్ల మూత్రపిండాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
ఈ నూనె వాడకం వల్ల హైపర్ థైరాయిడ్ రాకుండా ఉంటుంది.
ఆవనూనెను ఆహారంతో తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు దరి చేరవు.
జీర్ణవ్యవస్థతో సంబంధం ఉన్న చిన్నపేగు, జీర్ణాశయం, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియాలను హరిస్తుంది.
వంటకాల్లో ఇలా వాడాలి:
ఠ ఈ నూనెను నేరుగా కాకుండా పొగలొచ్చేవరకూ వేడిచేసి చల్లార్చి వాడాలి. వేడి చేయటం ఇష్టంలేని వాళ్లు ఆవనూనెను నెయ్యి, వేరుశనగ నూనెలతో కలిపి కూడా వాడొచ్చు.
కూరలు, పకోడీలాంటి వేపుళ్లు, పచ్చళ్ల తయారీకి ఉపయోగించొచ్చు
భోజనం అరగడానికి మాత్రమే అనుకుని నమిలే తమలపాకును ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులకు ఔషధంలా వాడతారు ఆయుర్వేద వైద్యులు. దీన్నే నాగవల్లి అనీ పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, థైమీన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కెరోటిన్.. వంటి విటమిన్లతోబాటు కాల్షియం కూడా సమృద్ధిగా లభ్యమవ్ఞతుంది.
ఇది జీవక్రియావేగాన్ని పెంచడంతో పాటు కొవ్ఞ్వని తగ్గిస్తుంది. మధుమేహం, ఊబకాయం తగ్గడానికి ఎంతో దోహదపడుతుంది. నోటి క్యాన్సర్లనీ అడ్డుకుంటుంది. ఈ ఆకుని నోట్లో పెట్టుకోగానే మండినట్లుగా అనిపించడానికి కారణం అందులోని చవికాల్ అనే ఫినాలిక్ పదార్థమే. ఇది యాంటీసెప్టిక్ గా పనిచేసి పుండ్లను నివారిస్తుంది. అందుకే దీన్ని గాయాలూ, కాలిన పుండ్లమీద పెట్టి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి.
తీవ్రమైన తలనొప్పితో బాధపడేవాళ్లు ఈ ఆకులు నమిలితే ఫలితం ఉంటుంది. లేదా దీని రసాన్ని నుదుట పట్టించినా నొప్పి తగ్గుతుంది. – బాగా అలసటగా అనిపించినప్పుడు తమలపాకు రసంలో టీస్పూను తేనె వేసి రోజుకి రెండుసార్లు తీసుకుంటే మంచి టానిక్‌లా పనిచేస్తుంది. తరచూ జలుబూదగ్గులతో బాధపడే పిల్లలకి గోరువెచ్చని ఆవనూనెలో తమలపాకుల్ని నానబెట్టి ఛాతిమీద పెడితే వెంటనే తగ్గుముఖం పడుతుంది. కాల్షియం లోపంతో బాధపడే వాళ్లు రోజుకి రెండు ఆకుల చొప్పున వరసగా మూడునెలలు తింటే ఫలితం కనిపిస్తుంది. రెండుటేబుల్ సూన్ల కొబ్బరినూనెలో టీస్పూను తమలపాకు రసం కలిపి ఒంటికి పట్టించి పావ్ఞగంట తరవాత వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి. ఆర్థ్రయిటీస్, కీళ్లనొప్పులతో బాటు గాయాలూ పుండ్లతో బాధపడేవాళ్లు తమలపాకు రసాన్ని ఆయా భాగాల్లో రాసి, దానిమీద తమలపాకుని అంటించి కట్టుకడితే తగ్గుముఖం పడతాయి.
టైం ఎంత?’.. చాలా తరచుగా ఏదో సందర్భంలో మనం అడిగే ప్రశ్న ఇది. అవతలి వారు టైం చెప్పగానే కృతజ్ఞతగా ‘థ్యాంక్స్’ అని బదులిస్తాం. ఇది కనీస మర్యాద. మరి, అసలు టైం (సమయం) మొదలయ్యేదే సూర్యుడి నుంచి. ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర సమయాలకు ఆయనే ఆద్యుడు. అటువంటి ఆదిత్యునికి మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలి?. అందుకే నిద్రలేచిన వెంటనే ఆయనకు ఒక నమస్కారం చేయడం మన కృతజ్ఞత. అదే క్రమంగా సంప్రదాయంగా మారి ‘సూర్య నమస్కారాలు’గా వ్యావహారికంలోకి వచ్చాయి
ఒక అద్భుత వ్యాయామ పద్ధతి..
ఒక విశిష్ట ఆసన సరళి..
ఒక మహ•న్నత శ్వాస నియంత్రణ..
ఒక పరమోత్క•ష్ట ధ్యాన విధానం..
ఒక క్రమం.. ఒక లయ.. ఒక పద్ధతి.. చూడ్డానికి కనులకు ఇంపు.. ఇదీ సూర్య నమస్కారాల ప్రత్యేకత.
ఏ ప్రాచీన నాగరికత, ఏ దేశ సంప్రదాయం చూసినా సూర్యుడు ఒక దేవుడు. అత్యంత శక్తి సంపన్నుడు. ఈ సృష్టికి, వాతావరణానికి, మన ఉనికికి మూలం- సూర్యుడు. ఆయన లేనిదే మన మనుగడ లేదు. అటువంటి సూర్యుడి గురించి చేసే ప్రార్థనలో ఒక వ్యాయామ పద్ధతి ఇమిడి ఉంది. ఆ వ్యాయామంలో ఒక ఆరోగ్య సూత్రం, శ్వాసని బంధింప చేసే పద్ధతి కలగలిసి ఉన్నాయి.
తూరుపు దిక్కు ఎర్రబారుతుండ•గా, పక్షుల కిలకిలరావాలతో, చిరుగాలుల సవ్వడి, తొలిమంచు తెరలు భూదేవిని కప్పి ముద్దు చేస్తుండగా, అపుడు వికసించిన పుడమి నిట్టూర్పులకి పుట్టుకొచ్చే మంచు రేణువులు.. ఇటువంటి ఆహ్లాదకర ప్రకృతితో, ప్రశాంత చిత్తానికి మనల్ని తీసుకె•ళ్లే వేళ తన అరుణారుణ కిరణాలలో సంపూర్ణ ఆరోగ్యాన్ని నింపి, సకల జీవులకు జీవజీవాల్ని నింపడానికి సమాయత్తమయ్యే ప్రత్యక్ష దైవానికి కృతజ్ఞతా పూర్వకమైన నివాళే సూర్య నమస్కారాలు.
నిజం చెప్పాలంటే.. యోగాసనాలను ఒక పొందికగా కూర్చి చేసిన ప్రయత్నమే సూర్య నమస్కారాలు. యోగాసనాలు నేర్చుకునేటప్పుడు ఒక విధమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అన్ని ఆసనాల్లో ఏది ముందు, ఏది తర్వాత అనే సంశయం కలుగుతుంది. సూర్య నమస్కారాల్లో అటువంటి సంశయాలు, గందరగోళానికి తావులేదు.
సూర్య నమస్కారాలు చక్కని వ్యాయామ పద్ధతే కాక, ఇది ఆరోగ్యాన్నిచ్చే ఒక సాధనం. ఉదయమే సూర్యకాంతిలో వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగి, చర్మం వి•మిన్ ‘డి’ తయారు చేస్తుంది. అలాగే, ప్రస్తుతం ‘మెనోపాజ్’ సమస్యలు చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. ఇలా స్త్రీ పురుషుల్లో ఇద్దరిలోనూ 35-40 ఏళ్లకు ఈ లక్షణాలు కన్పిస్తున్నాయి. అలాంటి మోనోపాజ్ వచ్చిన వారికి సూర్య నమస్కారాలు మంచి సమాధానమని ‘హార్మోన్ స్పెషలిస్ట్‌లు’ సూచిస్తున్నారంటే, వీటి గొప్పదనం అర్థం చేసుకోవచ్చు.
డైనమిక్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్:
సూర్య నమస్కారాలను ‘డైనమిక్ ఎక్సర్సైజ్’ అని కూడా అంటారు. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేసేటప్పుడు శరీరంలోని ప్రతి కండరం, ప్రతి భాగం, ప్రతి అవయవం, ప్రతి అంగుళం ఇన్వాల్వ్ అవుతాయి. ప్రతి కీలు, ప్రతి టెండన్, ప్రతి లిగ్మెంట్ కదులుతాయి. కాబట్టి మొత్తం శరీరానికిది సంపూర్ణ వ్యాయామం అవుతుంది.
సూర్య నమస్కారాలు మంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కూడా. వీటి వలన కండరాలు బాగా సాగి వాటిలో నిలువ ఉన్న లాక్టిక్ యాసిడ్స్ రూపంలో ఉన్న మెటబాలిక్ వేస్ట్ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. తద్వారా శరీరమంతా రిలాక్స్ అవుతుంది. యోగాసనాల్లోని ‘కౌంటర్ పోజెస్’ను సూర్య నమస్కారాలతో ఒక క్రమ పద్ధతిలో పొందుపరిచారు. ఇంకా చెప్పాలంటే.. వీటిని మామూలు ‘ఫిజికల్ ఎక్సర్సైజ్’లా కూడా చెయ్యొచ్చు. సూర్య నమస్కారాలను ఆచరించే వారిలో కాస్త సృజనాత్మకత ఉంటే.. వాటిలో ప్రాణాయామాన్నీ కలపవచ్చు. గాలి పీల్చడం, వదలడం, లోపల ఉంచుకోవడం, బయటకు వదిలి మళ్లీ పీల్చుకోకుండా ఉండటం.. ఇలా వివిధ దశల్లో అభ్యాసం చేస్తూ సూర్య నమస్కారాలను సాధన చెయ్యొచ్చు. అలా చెయ్యడం వలన శరీరంలోని స్టామినా లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇక ధ్యానాన్ని కూడా సూర్య నమస్కారాల్లో మంత్ర రూపంలో ప్రవేశ పెట్టవచ్చు. అప్పుడిక సూర్య నమస్కారాల పక్రియ అత్యద్భుత సాధన అవుతుంది.
సాధనకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
వయసు 55 ఏళ్లు దాటాక మొదటసారిగా సూర్య నమస్కారాలు ప్రారంభించడం అంత మంచిది కాదు. మొదట రెండు, మూడు నెలలు మిగతా ఆసనాలు వేశాక వీటిని నేర్చుకోవడం ఉత్తమం.
బి.పి., నడుపు నొప్పితో బాధ పడేవారు వీటిలోని ఫార్వర్డ్ బెండ్స్ (పాదహస్తాసన, పర్వతాసన) విషయంలో జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం నడుం నొప్పి పెరిగినా, వీటిని మానివేసి మిగతా వాటినే ప్రాక్టీస్ చేయాలి.
ప్రాణాయామ పద్ధతుల్ని ముఖ్యంగా కుంభకాన్ని ప్రవేశ పెట్టేటప్పుడు ముందుగా కొన్ని రోజులైనా మామూలుగా సూర్య నమస్కారాలని ప్రాక్టీస్ చేసి ఉండి ఉండాలి.
మొదటిసారే పెర్ఫెక్షన్ కోసం తాపత్రయ పడొద్దు:
సూర్యనమస్కారాలు చేసిన మొదటి రోజు కొద్దిగా ఒళ్లు నొప్పులు రావడం సహజం. కాబట్టి కంగారు పడి సాధన చేయడం మానివేయవద్దు.
వయస్సుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. అవి రాకుండా ముందే జాగ్రత్త పడాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. గుండెకు ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
జీడిపప్పు:
గుండె ఆరోగ్యానికి మంచిదైన ఒలేయిక్ ఆమ్లం ఆలివ్ జీడిపప్పులో లభ్యమవుతుంది. ఇంకా రాగి, మెగ్నీషియం, జింక్, ఇనుము ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు జీడిపప్పులో ఉన్నాయి కాబట్టి దీనిని విరివిగా వాడండి.
బాదం :
బాదం పప్పులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి వంటి ఖనిజ లవణాలు ఇ విటమిన్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ బాదం పప్పలు తింటే శరీరంలో హానికర కొవ్వునిల్వలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉండే ఫోలేట్, ఇతర బి విటమిన్లు పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధిస్తాయి.
చిట్కాలు
మధుమేహం: మామిడాకులు రాత్రిపూట నీటిలోకాచి ఉదయం వడకట్టి తాగవలెను. ద్రాక్ష పళ్ళు రోజుకు రెండు, మూడు తినవలెను. మధుమేహం అదుపులో వుంటుంది.
ఆస్తమా అదు పులో వుండాలంటే దాల్చిన చెక్క పొడిచేసి ఒక స్పూన్ తేనెకలిపి సేవించ వలెను.
"రక్తపోటు" నివారణకు ఒకస్పూను తేనె, ఒకస్పూను అల్లం రసం, ఒకస్పూను వెల్లుల్లి రసం కలిపి రోజుకు రెండుసార్లు సేవించవలెను.
ఆరోగ్యానికి శొంఠి అనగా ఎండబెట్టినఅల్లం ఇది ఆరోగ్యానికి చాలామంచిది. ఆకలి కలిగిస్తుంది. జలుబు, జ్వరాలకు, కడుపులో గడబిడకు మంచి ఔషధం. ఈ శొంఠి టీలో వేసుకుని తాగితే వెంటనే పనిచేస్తుంది లేదా పొడి చేసి అన్నంలో కలుపుకుని తినాలి. అజీర్ణానికి కూడా బాగా పనిచేస్తుంది. ఈక్రింద సూచించినట్లు పొడి తయారు చేసి సీసాలో తడి తగలకుండా వేసి భద్రపరచుకోవాలి. శొంఠి 50గ్రా, కందిపప్పు 2 tbsp, పెసరపప్పు 2 tbsp, సెనగపప్పు 2 tbsp, ధనియాలు 2 tbsp, నెయ్యి 4 tbsp, ఉప్పు తగినంత, రెండు చెంచాల నెయ్యి వేడిచేసి ధనియాలు పప్పులన్నీ విడివిడిగా వేయించాలి. మెగతా నెయ్యిలో శొంఠి చిన్నముక్కలుగా చేసి రంగుమారేవరకు వేయించాలి. చల్లారాక అన్నీకలిపి, తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో పొడి చేసుకోవాలి.
ఆరోగ్యానికి అరటిపండు: అరటిపండులో సహజసిద్దమైన చక్కెరలు, పీచుపదార్ధాలు సమృద్దిగా వుంటాయి.గంటన్నరశ్రమకు తగిన శక్తి రెందు అరటి పళ్ళు అందిస్తాయి. మనం టివిలో తరచూ సూస్తుంటాము ప్రపంచ టెన్నిస్ ఆగటగాలళ్ళు ఆటమద్య విరామ సమయములో రెందు పళ్ళు తినటం శక్తినివ్వటమే కాదు, అనేక రోగాలను నిరోదించేగుణం కలది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికిలోనైనవారు ఈఫలం తీసుకుంటె ఒత్తిడి తగ్గి మనస్సు ప్రసాంతంగా ఉంటుంది. ఇందులో ఉండే బి6 విటమిన్ రక్తంలోని చక్కరమోతాదుని నియంత్రిస్తుంది.దీనిలోఇనుపధాతువులను రక్తంలోని ఎర్రకణాలను వృద్దిచేసుంది. దీనిలోవుండేఅధికశాతం పొటాషియం వలన రక్తపుపోటుని అదుపులోవుంచి పక్షవాతంరాకుండాఆపుంది. దీనిలోని అధికపీచుపదార్ధంవలన మలబద్దకాన్నినివారిస్దుంది. దీనిని ప్రతిరోజూఏదోఒకసమయంలోభుజించుటవలన మెదడుకి చురుకుదనం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణశెక్తినిపెంపోందిస్తుంది. చాతిలో మంటను తగ్గిస్తుంది. వేవిళ్ళలతో బాధపడె మహిళలు వీటిని తింటే చాలవుపశమనంకలుగుతుంది.దోమకాటు వలన వచే వాపు, మంటకు పరటి పండుతొక్కలోపలిభాగంతో రుద్దితే తక్షణంవుపశమనంకలుతుంది.దీనిలోఫుండే B విటమిన్ నాడీమండలానికి మేలుచేస్తుంది. చిప్సు, చాక్లెట్లు తినుట మాని అరటిపండ్లను తినుటవల్ల్ల మానిసిక ఒత్తిడి ల్తగ్గించటమేకాకుండా ఊబకాయాన్ని నివారిస్తుంది.కడుపులో పుండ్లను (ulcers) నివారించుటలో మేటిఫలం. మానసిక ప్రశాంతత కలిగించుటలో ఈపండును మొదటచెప్పుకోవాలి. ధాయ్ లాండ్ దేశంలో గర్బిణిస్త్రీలు విధిగావీటినితినటంద్వారా పుట్టబోయే పిల్లలు సాత్విక స్వభావులుగావుంటారని నమ్ముతారు.ఋతువులమార్పువలన వచ్చే అనేక సమస్యలకు విరుగుడు ఈఫలమే! పొగ తాగే అలవాటుని మానిపించుటలో అరటి పండును గురించి ఆలోచించాలి. ఒత్తిడి తగ్గించేందుకు భోజన విరామ సమయంలో చిరుతిండిగా తీసుకుంటే ప్రయోజనం వుంటుంది. క్రమం తప్పకుండా ఈ పండును తినేవారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ఉలిపిరి కాయలను నిర్మూలించాలంటే అరటిపండు తొక్క లోపలి భాగం ఉలిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టరుని అతికించినచో క్రమంగా తగ్గుతాయి. ఆపిల్ తో పోలిస్తే నాలుగురెట్లు మాంసకృత్తులు, రెట్టింపు పిండిపదార్ధాలు, మూడురెట్లు భాస్వరం, ఐదురెట్లు విటమిన్ A కలిగివుంది. మీ కాలిబూట్ మెరుపు తగ్గిందా.. అరటి పండు తొక్కలోపలి భాగంతో రుద్దండి ఆతరువాత పాలిష్ చేయండి, మెరిసిపోతూ వుంటుంది.
అనాసపండు: అనాసపండు తినటంవల్ల జీర్ణవ్యస్తమెరుగుపడుతుంది. కీళ్ళవాపులనివారిణి, చర్మవ్యాధులురావు. రక్తపోటురాకుండా గుండెవేగాన్నినియంత్రిస్తుంది.
మూత్రపిండాల్లో రాళ్ళు: ఉలవచ్చారులో దానిమ్మపండుగింజలు కలిపి తినవలెను, తులసిఆకులరసం, తేనె కలిపి తీసుకొనవలెను.పుచ్చకాయలు తిన్నయెడల మూత్రపిండాల్లో రాళ్ళు హరించును. లివర్ పనిచేయనియెడల వేడినీళ్ళలో తులసిఆకులుకడిగి తినవలెను. ఇది అజీర్ణమునకు, కడుపునొప్పి నివారింఛును, మలేరియాకు, తలనొప్పికి కూడా మంచి ఔషధము.
ఆరోగ్యానికి తేనె:ఈ భూప్రపంచంలో పాడవని పదార్దం ఏదైనా వున్నదా? అని ప్రశ్నించుకుంటే అది తేనె మాత్రమే. చాలాకాలం వాడకపొతే చిన్న చిన్న స్పటికాల్లాగ కనబడుతయి. ఆసీసాను వేడినీళ్ళలో వుంచితే మామూలు తేనెలాగ మారిపోతుంది. దయచేసి తేనెను మిక్రొవేవ్ ద్వారా వేడి చేసేందుకు ప్రయత్నించకండి దానివలన అందులోని పోషకపదార్ధాలు నశిస్తాయి. తేనెతోపాటు దాల్చినచెక్కతోడయితే రోజూ మనం ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే చాలామంది తేనెను రాంబాణంతో పోల్చుతారు. ఏవ్యాధికైనా తేనెను వాడవచ్చు ప్రతికూల లక్షణాలు ఏమీవుండవు. డయాబెటిస్ సమస్య వున్న వాళ్ళు కూడా తగు మోతాదులో తీసుకోవచ్చు. తేనె దాల్చినచెక్క ఈకింది ఆరోగ్య సమస్యల నివారణకు మంచిది.
గుండెజబ్బులు: తేనె దాల్చినచెక్క పొడి బాగా కలిపి రొట్టెముక్కలపై పరచి జాం లాగ వాడాలి ఇలాక్రమం తప్పకుండా వాడితే కొలెస్ట్రాల్ రక్తనాళాలనుంచి తగ్గించి గుండె పోటు రాకుండా కాపాడుతుంది.
కీళ్ళవాతం:రోజూ పొద్దున్న సాయంత్రం ఒక కప్పు వేడినీళ్ళలో ఒక చెంచా తేనె అరచెంచా దాల్చిన పొడి ఒక్ నెలె రోఫుల పాటు వాడితే నోప్పులు మటుమాయం.
మూత్రాశయం సమస్యలు: రెండు పెద్ద చంచాల దాల్చిన పొడి ఒక చిన్నచెంచాతేనె ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని క్రమం తప్పకుండా వాడితే మూత్రాశయంలోనిబాక్టీరియాను నాశనంచేస్తుంది.
కొలెస్ట్రాల్: రెండుపెద్దచెంచాలు దాల్చినపొడి మూడు చిన్నచెంచాలు తెనె అరగ్లాసు టీనీళ్ళతో కలుపుకొని తాగితే కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది.
జలుపు, పడిశము:ఒకపెద్దచెంచాతేనె, పావుచిన్నచెంచా దాల్చినపొడి కలుపుకొని మూడురోజులు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది.
కడుపులో గడబిడ: ఒకపెద్దచెంచా దాల్చినపొడి ఒకచిన్నచెంచాతేనె కలుపుకొని తాగితే ఉదర సంబందిత సమస్యలు, గ్యాస్, పరిష్కారం అవుతాయి.
రోగనిరోధకశక్తి: రోజూకొంచం తేనె దాల్సినచెక్కపొడి కలుపుకుని సేవిస్తే రోగనిరోధకశక్తి పెరుగుదుంది.
అజీర్తి: దాల్చినపొదడి రెండు పెద్దచెంచాల తేనెతోకలిపి భోజనానికి ముందు సేవిస్తే అజీర్తి బాగా పనిచేస్తుంది.
ఇన్ ఫ్లూయింజా: ఒకపెద్దచెంచాతేనెను నోటిలోవేసుకొనిన దీనిలోవున్న పదార్దాలు వ్యాధికారక వైరస్ ను సంహరించి ఉపశమనమును కలుగచేస్తుంది.
దీర్ఘాయిష్: రోజూ నాలుగు చెంచాల తేనె ఒక చెంచా దాల్చినపొడి మూడుకప్పుల నీళ్ళలో కలిపె పొంగించి 'టీ" లాగ మూడు నాలుగు సార్లు తాగితే చర్మము మృదువుగా తయారవుతుంది. వార్ధక్య లక్షణాలను త్వరగా రనీయదు. ఎక్కువకాలం బ్రతకవచ్చు.
మొటిమలు: మూడు పెద్దచెంచాల తేనె ఒకచిన్నచెంచా దాల్చినపొడి పేస్టులాగ కలుపుకొని మొటిమలకి పట్టించి మర్నాడు వుదయం వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలారెండు వారాల పాటు ఆచరిస్తే మొటిమలు మాయం.
చర్మ వ్యాధులు: తేనె దాల్చిన్ పొడి సమపాళళ్ళో కలుపుకొని పట్టించాలి. గజ్జి, చిడుము, తామర తదితర చర్మవ్యాధులకు ఇది దివ్యంగా పనిచేస్తుంది.
అధికబరువు సమస్య: ఉదయాన్నేఅల్పాహారానికి ముందు, రాత్రి నిద్రకు వుపక్రమించేముందు ఒక్ పెద్ద చెంచాతేనె 1/2 చిన్న చెంచాదాల్చినపొడి ఒకకప్పు నీళ్ళల్లో మరిగించి తీసుకోవాలి.ఇది క్రమం తప్పకుండాసేవిస్తే అధిక బరువుని నియంత్రించి మరింత కొవ్వుచేరకుంటా చూస్తుంది.
కేన్సర్: జపాను ఆస్ట్రేలియా దేశాలలో జరిపిన పరిశోధనలలో ఉదరము ఎముకల కేంసర్ కె సమర్ధవంతముగా చికిచ్సచేసినట్ట్లు తెలిసింది. ఒక్ పెద్ద చెంచా తేనె ఒక్ చిన్న చెంచా దాల్చిన పొడి కలిపి ఒక నెల పాటు వాడితే మంచి ఫలితాలు సాధించినట్ట్లు రుజవైంది (రోజుకు మూడుసార్లు).
త్వరగా అలిసిపోవుట: ఒక గ్లాసు నీళల్లో పెద్దచేంచాలో సగం తేనె కలిపి దానిపై కొంచము దాల్చినపొడి జల్లి పడగడుపున, మధ్యాహ్నం 3 గంటలకు తీసుకొంటే అలసట మటుమాయం.
నోటి దుర్వాసన: ఫొద్దున్న పళ్ళుశుభ్రంచేసుకొన్న తర్వాత ఒక్ చిన్న చెంచా తేనె రెండు చిటికలు దాల్చిన్ పొడి వేడినీళ్ళల్లో కలుపుకొని రెండు, మూడు సార్లు పుక్కిలించి నట్లయితే రోజంతా తాజా శ్వాస.
వినికిడి లోపం: రోజూ ఉదయం రాత్రి ఒక చిన్న చెంచా తేనె అంటేప్రమాణంలో దాల్చినపొడి క్రమం తప్పకుండా సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది.
'మధుమేహం: డాల్సినచెక్క పొడిని అరా టీ స్పూన్ తీసుకుంటే గుండెకు హానిచేసే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్) కారక మాణాల వ్ఱుద్ధిని దాల్చినచెక్క నిరోధిస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్ వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు.
మతిపరుపు': వృద్ధాప్యంలో మతిపరుపు రావడమనివార్యము, అయితేయిదితప్పనిసరికాదని జార్గిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.పాట్రిషియా హారీస్ అంటున్నారు.వార్ధఖ్యంలో సరైన పోషకాహారం, మందులు వాడుతూ ఉంటే మతిమరుపు రాడంటారు ఆమె. మానసిక ఒత్తిడి లేకుండా, శరీరం ఆరోగ్యంగా ఉంటే మతిమరుపు రాదు.
త్రాగే నీరు విషయంలో ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్య చిట్కాలు మనిషికి కావలసిన అత్యంత ప్రధాన వనరులలో ముఖ్యమైనది నీరు, త్రాగే నీరు విషయంలో అత్యంత శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. త్రాగేనీరు TEST చేయడానికి రెండు రకాల TESTS ఉన్నాయి వాటిలో
H TEST
S. TESTE
P.H TEST నీటి యొక్క పిహెచ్ విలువ 7, కాబట్టి పిహెచ్ 6.5-85 ఉన్నా నీరు త్రాగడానికి అనుకూలం. పిహెచ్ 9 కన్నా ఎక్కువ ఉన్న నీరు యొక్క అలైన్ స్వభావం పెరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించి ఈ టెస్ట్ కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
చాలామంది పాతరోజులలో చెరువులలో, బావులలో, పంపులలో నీరు త్రాగేవాళ్ళం కదా, అప్పుడు ఈ టెస్ట్‌లు
చేయలేదు కదా అని అంటారు. నిజమే కానీ ప్రకృతి, పరిసరాలు ఈ రోజులలో ఎంత కలుషితం అయ్యాయో అనే
విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సగంపైనా శారీరక రోగాలకు కారణం కలుషితమైన నీరు త్రాగడం వల్ల అని మరచిపోవద్దు.
TD.S. TEST. 400 రూపాయలకు ఈ పరికరం ఆన్లైన్ స్టోర్లలో లభ్యమౌతుంది. త్రాగేనీరు యొక్క టి.డి.యస్, కనీసం 100 పి.పి.యం నుండి అత్యధికంగా 500 పి.పి.యం. వరకు ఉండవచ్చు. గమనించినట్లయితే 20 లీటర్ల వాటర్ క్యాన్లలో ఉండే నీటి యొక్క టి.డి.యస్. 50 ఏ.పి.యం, కన్నా తక్కువ ఉంటోంది చాలావరకు ఇది గమనించాల్సిన విషయం.
ఆహారం ఆరోగ్య చిట్కాలు:
పాలు త్రాగటం ఆరోగ్యకరమైన అలవాటే కానీ, కచ్చితంగా పాలు త్రాగాలని నియమచేదిలేదు. ఎందుకంటే తెల్ల నువ్వులలో కూడా పాలులో ఉన్న కానా ఎక్కువ క్యాల్షియం దొరుకుతుంది. కాబట్టి పాల మీద మనకున్న అవగాహనలో మార్పు రావాలి.
వేడిగా ఉండే పదార్ధాలనే కచ్చితంగా తినటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆకు కూరలను పిల్లలు, పెద్దలు పెద్దగా తినడానికి ఇష్టపడరు. కానీ, వారానికి కనీసం మూడు సార్లు ఆకు కూరలు కచ్చితంగా తినాలి. ముఖ్యంగా తోటకూర చాలా చాలా మంచిది. ఈ అలవాటును ఇప్పుడు మనం మన పిల్లలకు నేర్పకపోతే భవిష్యత్తులో వాళ్ళ పూర్తిగా ఆకు కూరలను మర్చిపోయే ప్రమాదం ఉంది.
పిల్లలకు ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు మొదలైనవాటిని పెట్టడం చాలా చాలా మంచిది. కనీసం వారానికి రెండు రోజులైనా ఈ స్నాక్స్ వారి ఆహారంలో ఉండేట్లు చూచవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.
1 వారానికి మూర లేదా నాలుగు సార్లు లెల్ల నువ్వుల ఉండ, వేరుశనగ ఉండ, సున్నుండ (బెల్లంతో చేసినవి) ఖచ్చితంగా పెట్టాలి.
వారానికి రెండు లేదా మూడు సార్లు కాలాన్ని బట్టి దొరికే అన్నిరకాల పండ్లను స్నాక్స్ పెట్టవచ్చు.
1 వారానికి రెండు లేదా మూడుసార్లు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తావు లాంటివి కూడా ఖచ్చితంగా స్నాక్స్ గా పెట్టాలి.
ఆహారం చేయకూడనివి:
ప్యాకేజ్ ఫుడ్ అన్ని ఆపేయాలి. నూడిల్స్, కుంకురే, లేస్, బింగో, ప్యాకేళ్ల స్వీట్స్ మొదలైన అన్నిటికి పిల్లలను దూరంగా ఉంచాలి. వీటిలో ప్రిజర్వటీస్గా కలిపే రసాయనాలు చాలా హానికరం.
నూనెలతో చేసే అన్ని పదాల ఉదాహరణకు పునుగులు, బజ్జీలు సమాసాలు మొదలైన వాటి పిల్లలను శాశ్వతంగా దూరంగా ఉంచండి, మసాలాలు, వేపుడు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచండి.
మామూలుగా పిల్లల విషయంలో చెక్కర వాడకం విషయంలో జాగ్రత్త మన ఆహార పదార్ధాల తయారీలో చెక్కర వాడకాన్ని తగ్గించాలి
చాలామందికి అనుమానం రావచ్చు. ఇవన్నీ చదివిన తరువాత తినటానికి ఏమి మిగిలిందని, ఇది తప్పు ఇవిగాక ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటి ఆహార పదార్ధాలు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలి మనకు ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడని.
ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఒక మనిషి తన జీవిత కాలంలో తీసుకోవాల్సిన ఆహారం కన్నా రెండు లేక మూడు రెట్లు తీసుకొంటున్నారని కధనం కాబట్టి మితాహారం ఆరోగ్యకరం
పెద్దలు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు:
ఉదయాన్నే మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పప్పును తినటం చాలా మంచిది,
ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి కచ్చితంగా అలవాటుగా చేసుకోండి,
ప్రతి మనిషికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం.
ఉప్పు వినియోగం గణనీయంగా తగ్గాలి. వాడకానికి సముద్రపు ఉప్పు చాలా మంచిది.
టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫంక్షన్స్ కి , వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తినవలసి వస్తే వాటిలో మనకు సౌలభ్యంగా ఉండేవాటిని
ఎంచుకొని మరీ తినాలి. సాధ్యమైనంత వరకు బయట తినటానికి నిరాకరించడమే మంచిది.
కూరగాయలను, పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలపాటు
ఉంచండి. ఆ తరువాత ఆ నీటిని పారపోసి మరలా వాటిని కడిగి పెట్టుకోండి. మరొక సారి కడగటం వల్ల చాలా వరకు హానికరమైన రసాయనాలను తొలగించవచ్చు.
నీరు త్రాగటం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకు 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి. వీలైతే చల్లని నీరు కన్నా
గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి అత్యంత మంచిది. ఉదయాన్నే ఒక లీటరు, గంట తరువాత ఒక లీటరు ఖచ్చితంగా త్రాగండి.
రాత్రి 7.00 గంటల లోపు లేదా ఖచ్చితంగా 8.00 గంటల లోపు ఆహారం తీసుకోండి. తిన్న తరువాత కనీసం ఒక అరగంట అయిన కచ్చితంగా నడవండి
అల్పాహారం ఆరోగ్య చిట్కాలు:
ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోశలకు దూరంగా ఉండాలి. వాటి బదులు జొన్నలు, మినుములుతో చేసిన ఇడ్లీ, దోశలను తినండి. ఇడ్లీ, దోశ వారానికి ఒకసారి మాత్రమే తినండి.
దోశలను నెయ్యితో కాల్చుకోండి నూనెను పూర్తిగా దూరం చేయండి.
ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు చాలా మంచి ఆహారం.
మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం.
పూరీలు, మైసూర్ బోండా మొదలైన టువంటిది నెలకు ఒక్కసారి అయితే పరవలేడు. వీలైతే వాటి సంచి పర్తిగా దూరంగా ఉండండి
వారానికి ఒకటి లేదా రెండు సార్ల వరకు చపాతీని నెయ్యితో కాల్చుకొని తినటం కూడా చెక్కవచ్చు.
మధ్యాహ్న భోజనం ఆరోగ్య చిట్కాలు
పాలిష్ బియ్యానికి పూర్తిగా దూరమవ్వాలని. వేరే మార్గం లేదు. దీని విషయంలో మరొక ఆలోచన కూడా అనవసరం.
బియ్యానికి దూరం కాయలేకపోతే మిగిలిన ఏకైక మార్గం ముడి బియ్యం అని గుర్తుంచుకోవాలి. తృణధాన్యాలు మంచి బలవర్ధక ఆహా
రాగి సంగటి, జొన్న అన్నం, కొర్ర అన్నం మొదలైనవి అన్యంత ఆరోగ్యకరమైన ఆహారం. కొర్రలు ప్రపంచస్థాయిని ఆకర్షించే అత్యంత పౌష్టికాషరం
మధ్యాహ్న భోజనంగా అన్ని రకాల కూరగాయలను తీసుకోండి. అన్నింటినీ నూనెలు లేకుండా చక్కగా వండుకొని తినవచ్చు.
ఖచ్చితంగా వారానికి మూడు రోజులపాటు ఆకు కూరలు వండవలసినదే. దీనిని ఖచ్చితంగా పాటించండి
రాత్రి భోజనం ఆరోగ్య చిట్కాలు
ఖచ్చితంగా 7.00 లేదా 8.00 గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్ణయ్యలాగా చూసుకోండి,
రాత్రికి రెండు లేదా మూడు జొన్న రొట్టెలు తీసుకొనటం అత్యంత ఆరోగ్యకరం.
వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్చీ ఆ పేస్టును కాలిన గాయాల పై రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
శరీరం పై కాలిన చోట పాలమీగడ రాస్తే బాధ తగ్గటమే కాదు, శరీరం రంగు కూడా మారుతుంది.
ఒక కప్పు నీళ్ళల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరగించి అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి వేడిగా త్రాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పదార్థాలు తక్కువ వుండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే ఎంతో మేలు.
ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పి వచ్చినా తల తిరిగినట్లుగా ఉన్నా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ముక్కు దిబ్బెడ వేసినప్పుడు ఒక చుక్క ఉల్లిరసాన్ని నాసికా రంధ్రాల్లో వేస్తే ఉపశమనం కలుగుతుంది.
మతిమరపు ఉన్నవారు తేనెను వాడాలి. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
సగానికి కోసిన నిమ్మచెక్క పై ఉప్పు, మిరియాల పొడి చల్లి సౌ మీద కొద్దిగా వేడి చేసి రసం పిండుకొని త్రాగితే మైగ్రెయిన్ తలనొప్పి నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మరసం, తేనె, గ్లిసరిన్ సమపాళ్ళలో కలిపి తడవకు చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
ఆరోగ్య చిట్కాలు
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగులు తగ్గుతాయి.
కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్‌లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి అక్కడ ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి.
ఆరు వంతుల నారింజ రసానికి, ఒక వంతు కారెట్ రసం, ఒక వంతు నిమ్మరసం చేర్చి, ఆ మిశ్రమాన్ని రోజుకి మూడు సార్లు సగం కప్ప త్రాగితే నరాల బలహీనత తగ్గుతుంది.
పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుసు ఉంటారు. సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని పిలలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇసుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్ కూడా లభిస్తుంది.
ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
కాలిన గాయాలకు టూత్ పేస్టును రాయడం వల్ల మంట తగ్గడమే కాకుండా గాయం తొందరగా తగ్గుతుంది.
కారట్ రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి భోజనానికి ముందు ఒక కపు తాగితే ముక్కు బాధల నుంచి ఉపశమనం పొందవచ్చను.
కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతంలో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి
బచ్చలి రసం, అనాసరసం సమపాళ్లలో తీసుకుని కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
బచ్చలి, కారట్ రసాలు సమపాళ్లలో కలిపి రోజుకు మూడు సార్లు సగం కప్ప చొప్పున తాగితే రోజంతా శక్తి, ఉత్సాహంతో ఉంటారు.
తేనెటీగ, కందిరీగ కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాస్తే వాపు, నొప్పి తగ్గుతాయి.
అరికాళ్లు విపరీతంగా మంటపుడుతుంటే గోరింటాకు గానీ, నెయ్యి గాని, సొరకాయ గుజ్జుగానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకుల రసంలో ఒక చెమ్చా తేనె కలిపి చప్పరిస్తే జలుబు, గొంతు నొప్పి,దగ్గు వెంటనే తగ్గుతాయి.
పంటినొప్పిగా ఉంటే లవంగం చప్పరిస్తే కొంత పంటినొప్పి తగ్గుతుంది.
మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి పద్ధతులను అనుసరించాలి?
వడబోసి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి.
తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారాన్ని, శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి.
బత్తాయి, నారింజ, కమలా పండ్ల వంటివి తినేటప్పుడు పిప్పి ఊసేయకుండా తినటం మంచిది. వీలయినంత వరకు కాయగూరల పైన తొక్కు తీయకుండా వండుకోవాలి.
వేసవి కాలంలో మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీటి పాత్రలోకి నేరుగా గ్లాసులను ముంచకుండా పాత్ర క్రింద భాగాన కుళాయి ఏర్పాటు చేసుకుంటే మంచిది. శుభ్రంగా ఉంటుంది.
ఆహార పదార్థాల పైన ఈగలు, క్రిమికీటకాదులు వాలకుండా ఎకోవాలి. కాయగూరలను పండ్లను నీళ్ళతో కడిగిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి.
రకరకాల తలనొప్పులకు ఓ దివ్య చిట్కా గవ్వల్ని నిమ్మరసంలో మునిగేలా 10 రోజులుంచితే అవి కరిగిపోతాయి. ఆ రసాన్ని తలకి పట్టిస్తే చాలు తలనొప్పి పోతుంది. జుత్తు కూడా ఒత్తుగా పెరుగుతుంది.
నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే ముందు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.
రక్తంలోని కొలెస్టరాల్ ను తగ్గించుకొని సన్నబడాలంటే పెరుగును ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవాలి.
రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో ఒక తులం పటిక బెల్లం వేసి వుంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పది హేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వనొప్పి తగ్గుతుంది.
చిటికెడు పసుపు గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతుంది.
గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది.
దగ్గు, ఆయాసంతో బాధపడేవారు అల్లం రసం 1 స్పూన్, దానిమ్మరసం 1 స్పూన్, తేనె 1 స్పూన్ ఈ మూడూ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగూ, ఆయాసం బాగా తగ్గుతాయి.
చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే మలబద్దకం పోతుంది,
అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజ నాలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.
మూత్ర విసర్జనలో బాధగా లేదా మంటగా ఉంటే క్యాబేజీని మాత్రం అసలు తినకూడదు.
చేమంతిపూలు ఆరోగ్య చిట్కాలు
చేమంతిపూలు శిరోజాలంకరణకే కాకుండా మరికొన్ని ఉపయోగాలు కూడా కలిగి ఉన్నాయి.
చేమంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి, ఒంటిపై దురదలున్న చోట రాస్తే తగ్గుతుంది. దురదలు వెంటనే తగ్గుతాయి. నోటిపూత వుంటే నోట్లో లోపల రాస్తే పూత
కాలి కండరం పట్టినట్లు మనకనిపించినప్పుడు వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలుని కదిపే ప్రయత్నం చేయాలి.
చేమంతి ఆకులను నేతితో వెచ్చచేసి, నుదుట పై, కణతల మీద వేసి కడితే తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైనవి తగ్గుతాయి.
దోమ కుట్టిన దద్దుర్లు, దురద పోవాలంటే అక్కడ ఉల్లిపాయ ముక్కతో రుద్దండి.
చేమంతి ఆకులతో కాచిన కషాయం ఉదయం, సాయంత్రం ఒక ఔన్సు తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుంది.
గవద బిళ్ళలు వస్తే అవిసె ఆకురసం రాస్తే త్వరగా తగ్గుతాయి.
చేమంతి ఆకులు, పూలతో కషాయం తీసి కురుపులు, గాయాలు కడిగితే వెంటనే మాయమౌతాయి.
ఒక్కొక్కసారి పొత్తి కడుపులో బిగబట్టినట్టుగా ఉంటుంది. ఆ సమయా వేడినీటిలో పేరిన నెయ్యి కొంచెం వేసుకుని తాగండి. నొప్పి తగ్గుతుంది.
చేమంతి పూల రసాన్ని తేలు, జెర్రి మొదలైన క్రిములు కుట్టిన చోట రాసి గుడ్డపొగ వేస్తే, విషం హరించి నొప్పి వెంటనే తగ్గుతుంది
మెడికల్ రిపోర్ట్స్ జాగ్రత్త
వైద్యుడి అవసరం అందరికీ కలుగుతుంది. కొన్ని రకాల జబ్బులకు ఇంతకు ముందు కలిగిన అనారోగ్యపు లక్షణాలు, అప్పుడు జరిగిన వైద్య చికిత్సకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటే వైద్యుడు మెరుగైన చికిత్స చేయగలుగుతాడు.
అందుకే ఇంటిలోని పిల్లల పెద్దల మెడికల్ రిపోర్ట్స్ ని జాగ్రత్త చేసే బాధ్యతని గృహిణి తీసుకోవాలి. ఎక్సరేలు, క్లినికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా దాచాలి.
ఇంట్లోని వారి రక్తం ఏ గ్రూపుకు చెందిందో పరీక్ష చేయించి, ఆ వివరాన్ని జాగ్రత్త చేయాలి. చిన్నతనంలో పిల్లలకు వచ్చిన జబ్బులు, వాటికి తీసుకున్న చికిత్స, టీకాలు వేయించిన తేదీల వంటి సమాచారం వుండటం అవసరం.
మెడికల్ రిపోర్ట్స్ ని కవర్లో పెట్టి దానిమీద వివరం రాసి పెట్టుకోవడం లేదా ఫైల్ చేయడం లేదా పాలిథిన్ కవర్స్ లో పెట్టటం మంచిది. ఇవైతే లోపలి కాగితాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఏ కాగితం అవసరమో దానిని మాత్రమే తీసుకోవచ్చు
సుఖనిద్ర ఎలా మీకు లభిస్తుంది ?
ఆహారం లేకపోయినా మానవుడు మనుగడ సాధించగలడు. కానీ కనీస నిద్ర లేకపోతే జీవించలేడు, అంతేకాదు మేధస్సు మందగిస్తుంది. అందానికి ఆనందానికి కూడా హాని కలిగిస్తుంది. కనుక రోజుకు కనీసం 6 గంటలు నిద్ర తప్పక పోవాలి.
వేడి చేసి చల్లార్చిన ఆలీవ్ ఆయిలని అర చేతులకు రుద్ది కాసేపటి తరువాత కాటన్ గ్లోవ్స్ ధరించి నిద్రకుపక్రమిస్తే ఫలితం కనిపిస్తుంది.
మారేడు కషాయం రెండు మూడు స్పూన్ల చొప్పున రోజుకు నాలుగుసార్లు తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
నిద్రలేమితో బాధపడేవారు బెడ్ మీద పడుకునే ముందు కొన్ని నిముసాల వరుకు మౌనంగా వుండి, గాఢమైన ఒక శ్వాసను పీల్చి, ఒకటి రెండు సెకండ్ల బిగపట్టి వదిలేయండి. నెమ్మదిగా ఈ పద్దతిని కొన్నిసార్లు రిపీట్ చేస్తే మీ
ఒక విధమైన ప్రశాంతత చోటు చేసుకుని క్రమంగా నిద్ర వస్తుంది.
ఆపిల్, జామ, బంగాళదుంప, తోటకూర, క్యారెట్ రసాలను ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటే ఎంత నిద్ర పట్టనివారికైనా నిద్ర పడుతుంది.
సంపూర్ణ ఆహార విలువలు
ఉదయం 6 గంటలకు 1 గ్లాసు పాలు లేదా రాగి జావ
8 గంటలకు 4 ఇడ్లీ లేదా సమానమైనటువంటి టిఫిన్
10 గంటలకు 1 గ్లాసు పండ్లరసం లేదా పండ్లు.
మధ్యాహ్నం 12 గంటలకు 2 కప్పుల అన్నం, 1 కప్ప ఆకుకూర పప్పు, 1 కప్పు
కూర, కప్పు పెరుగు, పచ్చి కూరగాయలు
4 గంటలకు 1 కప్పు టీ, స్నాక్స్ లేదా మొలకెత్తిన శెనగలు పెసలు లాంటివి
8 గంటలకు 2 చపాతీలు, కప్పు అన్నం, కప్పు కూర, రసం.
10 గంటలకు 1 గ్లాసు పాలు
పైన పేర్కొన్న విధంగా ఆహారం తీసుకుంటే మీకు సంపూర్ణ ఆహారం లభించినట్లే,
వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన ఆరోగ్య చిట్కాలు
ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి.
ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి.
చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి
జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి అరస్పూను పడి, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి.
పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి.
ద్రవ పదార్థాలు మజ్జిగ, నీరు, పండ్లరసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా వడదెబ్బ నివారించబడుతుంది.
అన్న ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే
బ్యాక్టీరియాతో పోరాడే అల్లం.
అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి అల్లం మన శరీరాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇనెఫెక్షన్లను తగ్గించడంలో అల్లం సాయపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం అల్లం అనేక బ్యాక్టీరియాలతో పోరాడగలదని సూచిస్తున్నాయి. అందుకే రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
వైరస్‌ని దూరం చేసే వెల్లుల్లి.
ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి. ఇది కూరలకు రుచిని మాత్రమే కాదు. అనేక ఆరోగ్యప్రయోజనాలతో నిండి ఉంది . వెల్లుల్లి వివిధ వ్యాధుల నివారణకు, చికిత్స ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లి యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియా సంక్రమణతో పోరాడటానికి ఒక ప్రభావవంతమైన ఔషధంగా పని చేస్తుంది. ఎందుకంటే ఇవి బ్యాక్టీరియాను, వైరల్‌ను, ఫంగల్, ఈస్ట్, వార్మ్ ఇన్ఫెక్షన్స్ ను నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది .
కొత్తిమీర.
కొత్తిమీర కూరలకు మంచి రుచి ఇస్తుంది. కొత్తిమీరని కూరల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. కొత్తిమీర కూరకి రుచి మాత్రమే కాదు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు, విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. కొత్తిమీర బరువుని తగ్గించేందుకు, చర్మ సౌందర్యానికి, మధుమేహం తగ్గించడానికి, కంటి చూపు మెరుగుపరచడానికి సాయపడుతుంది.
మీ ఇంట్టో గాలిని శుభ్రపరిచే ఇంట్లో పెరిగే మొక్కలు.
కొన్ని మొక్కలు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చటమే కాదు. గాలిలోని మలినాలను విషవాయువులను కూడా పీల్చి పరిశుభ్రం చేస్తాయి. వీటిని ఇండోర్ మొక్కలుగా పెంచుకుంటే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెపుతున్నారు. మీరు ఇప్పటికే ఇండోర్ గార్డెన్ నిర్వహిస్తున్నట్లయితే, తక్షణమే వీటికి మీ ఇంట్లో స్ధానం కల్పించి కాలుష్యం లేని చక్కటి గాలితో ఆరోగ్యాన్ని పొందండి.
ఈ క్రింది మొక్కలతో మీరు ఉండే ప్రదేశాలను అలంకరించుకుంటే మీరు పీల్చే గాలి స్వచ్చంగా ఉంటుంది.
వెదురు మొక్క చాలా గొప్పది, దాన్ని మీఇంట్లో పెంచినట్లయితే వాతావరణంలో ఉండే అన్నిరకాల రసాయనాలని తొలగిస్తుంది. దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు, అందువల్ల ఇంట్లోనే నీడ ఉన్న చోట పెంచవచ్చు. ఇది కార్బన్ మోనాక్సైడ్, బెంజేన్, ఫార్మాల్డిహైడ్, గ్సైలిన్, క్లోరోఫారం వంటి వాటిని తొలగిస్తుంది, వీటిని లాండ్రీ రూమ్, లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఉంచడం మంచిది.
భారతదేశంలో రబ్బరు చెట్లు చాలా సర్వసాధారణం. వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎక్కువ వెలుగు, నీరు, ఎరువులు ఎక్కువ మోతాదులో అవసరం. ఇది కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోథైలిన్ ని తొలగించడానికి మంచి ఎంపిక.
వెదురు లాగానే పోక చెక్క మొక్క కూడా ఒకటి. దీని ఆకులు అల్లుకున్నట్లు ఉండి చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. వీటి పెరుగుదలకు ఎక్కువ సూర్యకాంతి, నీరు అవసరం. ఇది బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, గ్సైలిన్, ట్రైక్లోరోథైలిన్, ఫార్మాల్డిహైడ్ ని తొలగించడమే కాకుండా గాలిని చల్లబరుస్తుంది కూడా.
అందమైన తులిప్ మొక్కలు ఇంట్లో అందంగా కనిపించడమే కాకుండా, గాలిని స్వచ్చ పరుస్తాయి. నేరుగా సూర్యకాంతి పాడనీ చోట వీటిని ఉంచి, ప్రతిరోజూ తేమగా ఉందొ లేదో అని మట్టిని పరీక్షించాలి. ఇది అమ్మోనియాను పారద్రోలుతుంది.