జట్టిజాం పాటలు

జట్టిజాం పాటలనే కొన్నిప్రాంతాల్లో జక్కీక పాటలంటారు. వెన్నెలరాత్రుల్లో స్త్రీలు మండలాకారంలో నిలబడి ఉభయపార్శ్వాలలో ఉద్దికత్తెలతో ఒద్దికలు చెడకుండా ఒకసారి కుడివైపుకు, ఇంకొకసారి ఎడమవైపుకు తిరిగి ఆయా వైపులనుండే వారి అరచేతులను తమ అరచేతులతో తట్టుతూ గుండ్రంగా అడుగులు వేసి తిరుగుతూ పాడుతూ ఆడే ఆటే "జట్టిజాము/జక్కీక".