చేత వెన్న ముద్ద -
చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు -
పట్టుదట్టి
సందిట తాయత్తులు -
సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణా నిన్ను -
చేరి కొలుతు.