శ్రీ రామనవమి పూజావిధానము

ప్రాతఃకాలమున నిద్రలేచి స్నానాది నిత్యకృత్యాలను ఆచరించి, శుద్ధుడై, తులసీ పుష్ప ఫలాది పూజాద్రవ్యాలను ఏర్పరచుకొని - శ్రీరాముని పటానికి గానీ, విగ్రహనికి గానీ యధావిధి పూజించాలి.