ఎగ్ డ్రాప్ కర్రీ:

కావలసిన పదార్థాలు :

గుడ్లు - 4

నెయ్యి - టేబుల్ స్పూన్

ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి రెబ్బలు - 2

కొబ్బరి పాలు - అర కప్పు

ఉప్పు - తగినంత

టమాటా - 1


మసాలా కోసం :

కాశ్మీరీ మిర్చి - 6

ధనియాలు - 2 టీ స్పూన్లు

జీలకర్ర - టీస్పూన్

పసుపు - అరటీస్పూన్

కొబ్బరి తురుము - 4 టేబుల్ స్పూన్లు

చింతపండు - నిమ్మకాయంత

వెల్లుల్లి రెబ్బలు - రెండు


తయారుచేసే పద్ధతి :

ముందుగా మసాలా కోసం తీసుకున్నవన్ని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు చిలకరించి మెత్తగా రుబ్బాలి. వెడల్పాటి పాన్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేయాలి. వేగాక మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత కప్పు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు గుడ్లను పగలకొట్టి సొనను జాగ్రత్తగా కూరలో వేయాలి. ఈ సొనలు ఒకదానికొకటి తగలకుండా, చెదిరిపోకుండా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఓ స్పూన్ గ్రేవీ ని గుడ్ల సొన మీద వచ్చేలా కప్పాలి. ఇప్పుడు సొనలు ఉడికే వరకు కదపకుండా ఉడికించుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి మెల్లగా కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడికాయి అనుకున్న తర్వాత కొత్తిమీర తురుము చల్లి దించాలి. ఈ ఎగ్ డ్రాప్ కర్రీను గోవావాసులు ఎక్కువగా చేసుకుంటారు.