చికెన్ రోస్ట్:

కావలసిన పదార్ధాలు :

చికెన్ : 1 కేజీ

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు

మిరియాలు : 10

లవంగాలు : 5

దాల్చిన చెక్క : 2

యాలకులు : 4

ఎండుమిరపకాయలు: 3

నిమ్మకాయల రసం : 2 టేబుల్ స్పూన్లు

నూనె : 3 టేబుల్ స్పూన్లు

ఉప్పు : తగినంత


తయారీ విధానం :

మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంతకు ముందు పొడి చేసుకున్న సగం పొడి కలిపి 2 గంటలు నానపెట్టాలి. ఒక బాండి లో నూనె వేడి చేసి కారం, మిగతా మసాలా పొడి వేసుకోవాలి. నాన పెట్టిన చికెన్ వేసి ఉడికిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. అంతే, ఘుమఘుమలాడే చికెన్ రోస్ట్ రెడీ.