ధనియా చికెన్ ఫ్రై:

కావలసిన పదార్థాలు :

కోడి మాంసం - 250 గ్రా.

పట్టా, లవంగం - కొంచెం

నూనె - 5 స్పూన్లు

కారం పొడి - ఒకటిన్నర స్పూన్లు

పసుపు - అర స్పూన్

వెల్లుల్లి - 6 పాయలు

అల్లం - 6 చిన్న ముక్కలు

ధనియాలు - 4 స్పూన్లు

ఉల్లిపాయలు - 2 (పెద్దవి)(తరిగి పెట్టుకోవాలి)

కొబ్బరి - ఒక ముక్క

పచ్చిమిరపకాయలు - 3(తరిగి పెట్టుకోవాలి)


తయారుచేసే పద్ధతి :

ముందుగా కోడి మాంసాన్ని కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి. తర్వాత మాంసానికి కారం పొడి, పసుపు కలపాలి. తర్వాత అల్లం, వెల్లుల్లికి కొంచెం ఉప్పు చేర్చి పేస్ట్ లా చేసుకొని, మాంసానికి పట్టించాలి.

తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి అందులో మూడు స్పూన్ల నూనె పోసి, బాగా కాగాక మాంసం ముక్కలు అందులో వేసి, కొన్ని నీళ్ళు పోసి బాగా ఉడకనివ్వాలి.

మరో వైపు ధనియాలను మూకుడులో వేయించి (నూనె లేకుండా), కొబ్బరి, పట్టా, లవంగాలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు మరో బాణలిలో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉడికించిన మాంసాన్ని కలపాలి. మాంసం దించుకునే సమయంలో ధనియా, కొబ్బరి మిశ్రమాన్ని పైన చల్లుకోవాలి. తర్వాత మాంసాన్ని బాగా కలబెట్టి దించుకోవాలి. ఇంతే ఘుమఘుమలాడే ధనియా చికెన్ ఫ్రై రెడీ.