గ్రీన్ టీ విత్ తులసి:

కావలసిన వస్తువులు :

నీళ్లు - 2 కప్పులు

గ్రీన్ టీ + తులసి టీ బ్యాగులు - 2

పంచదార - 2 టీ స్పూన్లు


తయారు చేసే విధానం :

నీళ్లను మరిగించాక, అందులో టీ బ్యాగ్ వేసి రెండు మూడు నిమిషాలు ముంచి తీస్తూ చేయాలి. అలా చేయడం వలన వాటిలో ఉండే ఫ్లేవర్ టీ లోకి వస్తుంది. (వీటిని నీటితో కలిపి మరిగించకూడదు. సాధారణంగా ఒక కప్పు టీ కి ఒక బ్యాగ్ సరిపోతుంది)పంచదార జత చేయాలి. ఇష్టపడేవారు పాలు కూడా కలుపుకోవచ్చు.