పీతల కూర:

కావలసిన వస్తువులు :

పీతలు - అరకేజి,

కరివేపాకు - 4 రెమ్మలు,

ఎండు మిర్చి - 1,

అల్లం - అరంగుళం ముక్క,

వెల్లుల్లి రెబ్బలు - 6,

ఉల్లిపాయ - 1,

పచ్చిమిర్చి - 2,

గరం మసాల పొడి - 1 టీ స్పూను,

పసుపు,

కారం - 1 టీ స్పూను చొప్పున చింతపండు గుజ్జు - అర టీ స్పూను,

టమేటో - 1,

కొత్తిమీర - 1 కట్ట,

ఉప్పు రుచికి తగినంత,

నూనె సరిపడా.


తయారు చేసే విధానం :

పీతల్ని శుభ్రం చేసి పక్కనుంచుకోవాలి. కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక, తరిగిన అల్లం, వెల్లుల్లి, పసుపు కలిపి నిమిషం తరువాత ఉల్లిపాయల్ని కూడా వేసి వేగించాలి. పచ్చిమిర్చి, గరం మసాల పొడి, చింతపండు గుజ్జు, తరిగిన టమేటోను వేసి రెండు నిమిషాల తర్వాత పీతల్ని కూడా వేసి బాగా కలపాలి. అరగ్లాసు నీటిని జతచేసి పీతలు ఉడికేదాకా ఉంచాలి. దించాక కొత్తిమీర చల్లాలి. వేడి అన్నంతో పీతల కూర చాలా రుచిగా ఉంటుంది.