మటన్‌ లివర్‌ ఫ్రై:

కావలసిన వస్తువులు :

లివర్‌ (ముక్కలు) - అరకేజీ,

పసుపు - అర టీ స్పూను,

కారం - 1 టీ స్పూను,

దనియాల పొడి - 1 టేబుల్‌ స్పూను,

(ఇష్టమైతే) మిరియాల పొడి - అర టీ స్పూను,

ఉల్లి తరుగు - అరకప్పు,

టమోటా - 1,

అల్ల వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను,

దాల్చినచెక్క - అంగుళం ముక్క,

లవంగాలు - 3,

కరివేపాకు - 4 రెబ్బలు,

ఉప్పు - రుచికి తగినంత,

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.


తయారు చేసే విధానం :

నూనెలో దాల్చినచెక్క, లవంగాలు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి వేసి వేగించాలి. తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు కలపాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, దనియాలపొడి, కరివేపాకు, పసుపు వేసి, రెండు నిమిషాల తర్వాత లివర్‌ ముక్కలు వేసి, పావు కప్పు నీరు పోసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత (నీరు ఆవిరయ్యాక) కొత్తిమీర చల్లి దించేయాలి (ఎక్కువ సేపు ఉడికిస్తే ముక్కలు గట్టి పడిపోతాయి). పరాటాలతో పాటు, అన్నంతో నంజుకోడానికి కూడా బాగుండే ఫ్రై.