గోంగూర పచ్చడి

పుల్ల పుల్లని గోంగూర ఇష్తపడని తెలుగు వారుంటారా?? చాల తేలికగా అయిపొయె పచ్చడి యెలా చేసుకొవాలో చూద్దాం.

కావలసినవి :

గోంగూర ఆకులు 6 కప్పులు

పచ్చిమిరపకాయలు 10

ఉల్లిపాయలు 3

పోపు సామాన్లు

నూనె మూడు చెంచాలు

విధానం:

గోంగూర వలిచి కడిగి ఆరబెట్టుకోవాలి. బాండీలొ నూనె వేసి వేడి అయ్యాక గోంగూర ఆకు వేసి వేయించాలి.ఇష్టమున్నవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. . మధ్య మధ్యలొ కలుపుతూ వుండాలి. ఆకు రంగు మారి పచ్చి వాసన పోయి గుజ్జు గా అవ్వాలి.

తరువాత నాలుగు భాగాలుగా చెసిన ఉల్లిపాయలు, మిరపకాయలు వేసి మూడు నిముషాలు వేగనివ్వాలి. పొయ్యి కట్టేసి ముందు రోటిలో గోంగూర వెసి మెదుపుకొవాలి, తరువాత ఉల్లి, పచ్చిమిర్చి వెసి దంచుకొవాలి. మిక్సి ఐనా అంతె ముందు గోంగూర వెసి తిప్పాక తరువాత ఉప్పు, ఉల్లిపాయలు, మిరపాకయలు వెసి తిప్పాలి. గిన్నెలోకి తీసుకుని తిరగమోత వెసుకుంటే ఆంధ్రమాత గోంగూర పచ్చడి తయారు!