గోధుమ రవ్వ ఓట్స్ ఇడ్లీలు.

గోధుమ రవ్వ, ఓట్స్ తో ఈ సారి ఇడ్లీ చేసి చూడండి. షుగర్ పేషంట్లకి, బరువు తగ్గాలి అనుకునేవారికి మంచి రెసిపి ఇది!

కావల్సినవి:

గోధుమ రవ్వ ఒక కప్పు

ఓట్లు ఒక కప్పు

ఉప్పు చిటికెడు

వంట సోడ చిటికెడు

పెరుగు ఒక కప్పు

నీరు తగినంత

విధానం:

ఓట్లు ఒక నిముషం వేయించి మిక్సీ లో వేసి పొడి చెయ్యండి.

గోధుమ రవ్వ కూడ వేయించి ఈ ఓట్స్ పొడికి కలిపి మిక్సీ పట్టండి.

మరీ పొడి అవ్వకర్లేదు. బాగ కలిస్తే చాలు.

గిన్నెలోకి తీసుకుని ఉప్పు , సోడా, పెరుగు వేసి బాగ కలిపి, తగినంత నీరు పోసి ఇడ్లీ పిండి లాగ కలిపి పావుగంట నాననివ్వండి.

మీకు సమయం ఉంది అనుకుంటే ఈలోగా కారట్ తురుము, బీన్స్, ఉల్లిపాయలు, నాన బెట్టిన బటాని, కరివెపాకు, కొత్తిమీర, అల్లం, స్వీట్ కార్న్ వేసి వెయించి పిండిలో కలుపుకోవచ్చు. లేక పొయిన పరవాలేదు.

పావుగంట అయ్యాక ఇడ్లి ప్లేట్లకి నెయ్యి రాసి ఈ పిండితో ఇడ్లీలు వేసుకోండి. రుచి బావుంటాయి. యెదైనా చట్నీ తో వడ్డించండి.