పుట్నాల పొడి.

నాకు తెలిసి మన తెలుగు వంటల్లో అతి త్వరగా చక చకా అయిపొయే పధార్ధం ఇదే అనుకుంటా! పిల్లలున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి చాలా హాయిగా అనిపిస్తుంది. మంచి ప్రోటీన్ కూడా. ఈ పొడి కొట్టుకుని వుంచుకుని ఏ టమొటా చారో పెట్టుకున్నమనుకోండి ఆ పూటకి మంచి భొజనం తయారైనట్టే! పది రోజులు వరకు కమ్మగా నిలవ వుంటుంది. చెయ్యడం ఒక నిముషం పనే!!

కావలసినవి:

పుట్నాలు/తినే పప్పులు 1 కప్పు

కారం సగం చెంచా

జీలకర్ర ఒక స్పూను

ఉప్పు తగినంత

విధానం:

పొడిగా వున్న మిక్సీ లో పైన చెప్పినవన్ని వేసుకొని ఒక అర నిముషం పాటు తిప్పండి. అంతే! పది రోజులు పాటు నిల్వ వుండే పొడి సిద్ధం. ఒక గాజు సీసాలో పోసుకున్నారంటె అలసిపొయినప్పుడో లెదా టైం లేనప్పుడో, పిల్లలకు మటుకే వండాల్సినపుడో చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పొడితో పెట్టెయండి. సరిపోతుంది!