బెల్లం సున్నుండలు.

సున్నుండలు మనకు తెలియనివి కావు. ఈ సారి బెల్లంతో చేసి చూడండి. పంచదార కన్నా బెల్లం ఆరోగ్యానికి యెంతో మంచిది.

కావలసినవి:

మినపప్పు ఒక కప్పు

బెల్లం తురుము ఒక కప్పు

నెయ్యి అర కప్పు

విధానం:

పొయ్యి వెలిగించి మినపప్పు ఒక బానలిలో తీసుకుని చిన్న మంటపై దోరగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించండి.

కొంచెం రంగు మారి మంచి వాసన వస్తుంది అప్పుడు పొయ్యి కట్టేయండి. చల్లారనీయండి.

బెల్లం తురిమి లేదా కచ్చా పచ్చి గా దంచి ఉంచుకోండి.

మిక్సి గిన్నె తడి లేకుండా చూసుకుని మినపప్పు వేసి మెత్తగా పొడి చేసుకోండి. అందులొనే బెల్లం తురుము కూడ వేసి తిప్పండి. మినపప్పు, బెల్లం బాగ కలిసిపోతాయి.

ఒక వెడల్పాటి గిన్నెలోకి ఈ మిశ్రమాని తీసుకుని కరిగించిన గోరువెచ్చని నెయ్యి వేసి బాగ కలిపి సున్నుండలు చుట్టుకోండి.

తడి తగలకుండా వుంటే పది రోజులు నిలవ ఉంటాయి.