రొయ్యల పులుసు:

కావలసిన పదార్థాలు :

రొయ్యలు - 250 గ్రా.

ఉల్లిపాయలు - రెండు (పెద్దవి )

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి - రెండు పాయలు

టమోటా - 150 గ్రా.

బంగాళాదుంప - 1 పెద్దది

పచ్చిమిరపకాయలు - 2

నూనె - 150 గ్రా.

కారం పొడి - 3 టీ స్పూన్లు

పసుపు - చిటికెడు

కరివేపాకు - 5 రెమ్మలు

కొత్తిమీర - కొంచెం

ఉప్పు - తగినంత


తయారుచేసే పద్ధతి :

మొదట రొయ్యలను శుభ్రం చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి. అదే విధంగా టమోటాలు, ఉల్లిపాయ, బంగాళాదుంపను (చెక్కు తీసి) చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.


తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు (మధ్యలో చీల్చి) వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.

అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి. తర్వాత రొయ్యలు వేయాలి. అనంతరం చిటికెడు పసుపు వేసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి. అలాగే టమోటా, బంగాళాదుంప ముక్కలు, కారం పొడి, ఉప్పు వేసి మరో పది నిముషాలు మూత పెట్టి ఉడికించాలి. కాసేపయ్యాక కొంచెం నీళ్ళు పోసి, ఈ మిశ్రమం దగ్గరకు అయ్యేవరకు ఐదు నిముషాలు సిమ్ లో ఉడికించి దించేయాలి.