క్యాబేజీ వడియాలు:

కావలసిన పదార్థాలు :

క్యాబేజీ : కేజీ

మినపప్పు : అర కేజీ

పచ్చిమిర్చి : 100 గ్రా.

ఇంగువ : రెండు చెంచాలు

ఉప్పు : తగినంత

కొత్తిమీర : ఒక కట్ట


తయారుచేసే విధానం:

మినపప్పును రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా, కొత్తిమీరను మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా పేస్ట్ లా చేసుకోవాలి. నానిన మినపప్పును మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. అందులో క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, ఉప్పు, ఇంగువ వేసుకొని మరోసారి కలిపి వడియాల్లా పెట్టుకోవాలి. బాగా ఎండాక డబ్బాలోకి తీసుకుంటే సరిపోతుంది.