క్యారెట్ వడియాలు:

కావలసిన పదార్థాలు :

క్యారెట్ : అర కేజీ

పెసర పప్పు : రెండు కప్పులు

యాలకులు : 12

లవంగాలు : 12

దాల్చినచెక్క ముక్కలు : రెండు లేదా మూడు

వెల్లుల్లి రెబ్బలు : ఆరు

జీలకర్ర : నాలుగు చెంచాలు

పచ్చిమిర్చి : 100 గ్రా.

అల్లం తరుగు : రెండు చెంచాలు

ఉప్పు : తగినంత


తయారుచేసే విధానం :

పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టుకొని మిక్సీలో మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. దీన్ని పెసరపిండిలో వేసి క్యారెట్ తురుము, తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి వడియాల్లా పెట్టుకోవాలి.