తియ్య గుమ్మడితో వడియాలు :

కావలసిన పదార్థాలు :

తియ్య గుమ్మడి ముక్కలు : రెండు పెద్దవి

మినపప్పు : రెండు కప్పులు

సెనగ పప్పు : రెండు కప్పులు

పచ్చిమిర్చి : సరిపడా (ఇరవై నాలుగు)

ఇంగువ : ఒక స్పూన్

జీలకర్ర : ఐదు స్పూన్లు

కరివేపాకు : పది రెమ్మలు

ఉప్పు : సరిపడా (ఐదు స్పూన్లు)

ఉల్లిపాయలు : రెండు


తయారుచేసే పద్ధతి :

మినప్పప్పు, సెనగపప్పును రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. గుమ్మడి ముక్కల్ని శుభ్రంగా కడిగి చెక్కుతో సహా చిన్న చిన్న ముక్కల్లా తరగాలి. ఇప్పుడు నానిన పప్పుల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు రెమ్మలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. చివరగా ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసి మిక్సి పట్టాలి. అయితే ఇవి మరీ మెత్తగా నలగకుండా చూసుకోవాలి. ఇందులో ఉప్పు, ఇంగువ వేసి బాగా కలిపి వడియాల్లా పెట్టుకుంటే సరిపోతుంది.