నువ్వుల వడియాలు:

కావలసిన పదార్థాలు :

బియ్యప్పిండి : ఒక గ్లాస్

సగ్గుబియ్యపు పిండి : కొద్దిగా

నువ్వులు : అర కప్పు

గసగసాలు : పావుకప్పు

నూనె : రెండు చెంచాలు

ఉప్పు : తగినంత

జీలకర్ర : ఐదు చెంచాలు

రాగిపిండి : ఒక కప్పు


తయారు చేసే విధానం :

ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీళ్ళు, నూనె తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. ఈ నీళ్ళు మరిగే లోపు మరో గిన్నెలో బియ్యపు పిండి, సగ్గుబియ్యపు పిండి, నువ్వులు, గసగసాలు, ఉప్పు, జీలకర్ర, రాగిపిండి తీసుకొని అన్నీంటిని బాగా కలపాలి. నీళ్ళు మరిగాక బియ్యపు పిండి మిశ్రమాన్ని అందులో వేసి మంట తగ్గించి ఉండలు కట్టకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. బియ్యపు పిండి ఉడికి చిక్కటి జావలా అయ్యాక దింపేయాలి. దీన్ని గరిటెతో ప్లాస్టిక్ కాగితంపైన వడియాల్ల వేసి ఎండలో ఉంచాలి. రెండు రోజులు ఎండలో ఆరనివ్వాలి.