పెసరపప్పు వడియాలు:

కావలసిన వస్తువులు :

పెసరపప్పు-పావుకేజి,

గోరుచిక్కుడు కాయలు-పావుకేజి

పచ్చిమిర్చి-100గ్రా.,

జీలకర్ర,

ఇంగువ-ఒక టీస్పూన్‌ ఉప్పు-తగినంత


తయారు చేసే విధానం :

రెండు గంటలు నానబెట్టిన పెసరపప్పులో పీచుతీసి ముక్కలు చేసుకున్న గోరుచిక్కుడు కాయలు వేసి బాగా రుబ్బుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముద్ద, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకుని పాలిథిన్‌ పేపరు మీద చిన్నచిన్న ముద్దలుగా పెట్టుకోవాలి. బాగా ఎండిన తరువాత నూనెలో వేయించుకుంటే అన్నంలోకి, సాంబారులోకి నంజుకోవటానికి చాలా బాగుంటాయి.