బీరకాయ కారం:

కావాల్సిన పదార్థాలు :

5 చిన్న బీరకాయలు

పచ్చి శనగపప్పు ఒక కప్పు

మినప్పప్పు అర కప్పు

ధనియాలు రెండు స్పూన్లు

ఎండు మిరపకాయలు 4

చింతపండు కొద్దిగా

కరివేపాకు


తయారు చేసే విధానం:

ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి పెద్ద ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలు దోరగా వేయించి పొడి చేసుకోవాలి. బాణలి పెట్టి నూనె వేసి కాగాక, జీలకర్ర, ఆవాలు వేసి పోపు వేయాలి. తరవాత కరివేపాకుతో పాటు బీరకాయ ముక్కలను కూడా వేసి, పసుపు,తగినంత ఉప్పు వేసి, సన్నని మంటపై మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికిన తరవాత తయారు చేసుకున్న పొడిని కలిపి, రెండు స్పూన్ల చింతపండు రసాన్ని కూడా చేర్చి మరో 5 నిమిషాలుంచి దించేయడమే!