వంకాయ మసాలా:

కావాల్సిన పదార్థాలు :

8 చిన్న వంకాయలు

రుచికి తగినంత ఉప్పు

1 స్పూన్ కారం

1 స్పూన్ పసుపు

1 స్పూన్ గరమ్ మసాలా

2 స్పూన్ల ధనియాల పొడి

2 స్పూన్ల ఎండు మామిడి పొడి

1 స్పూన్ సోంప్, 1 స్పూన్ శనగపిండి


తయారు చేసే విధానం:

వంకాయలను కడిగి తడి లేకుండా కడిగి ఆరబెట్టాలి. వంకాయలను నాలుగు చీలికలుగా గుత్తిగా తరగాలి. పైన చెప్పిన దినుసులను కలిపి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంకాయల్లోకి జాగ్రత్తగా కూరాలి. ఒక బాణలిలో నూనె వేసి కాగిన తరవాత ఒక్కో వంకాయను జాగ్రత్తగా బాణలిలో వేయాలి. మూతపెట్టి సన్నని మంటపై ఉడకనివ్వాలి. వంకాయలు అడుగు అంటకుండా మధ్యలో కదుపుతూ ఉండాలి. 20 నిమిషాలలో కూర తయారై పోతుంది.