టొమాటో గుత్తికూర:

కావలసినవి:

టొమాటోలు - 250 గ్రా (గాట్లు పెట్టాలి);

ఉల్లిపాయలు - 2;

కొబ్బరిపొడి - 2 టేబుల్‌స్పూన్లు;

జీలకర్ర పొడి - 1/2 టీ స్పూన్;

మెంతిపొడి - 1/4 టీ స్పూన్;

పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు;

పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు;

నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు;

చింతపండు పులుసు - 1/4 కప్పు;

ఉప్పు - తగినంత;

కారం - టీ స్పూన్;

ధనియాల పొడి - టేబుల్ స్పూన్;

అల్లం వెల్లుల్లి ముద్ద - టీస్పూన్;

కరివేపాకు - 1 రెమ్మ;

నూనె - 3 టేబుల్ స్పూన్లు


తయారి:

ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకోవాలి. పల్లీలు, నువ్వులు (నూనె లేకుండా) కొద్దిగా వేయించి, పొడి చేసుకోవాలి. నూనె వేడి చేసి, ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. మిక్సీలో... ముందుగా తయారుచేసి ఉంచుకున్న పొడి, చింతపండు పులుసు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక, గాట్లు పెట్టి ఉంచుకున్న టొమాటో లను మగ్గనివ్వాలి. తరవాత గ్రైండ్ చేసిపెట్టుకున్న మసాలాపేస్ట్, కొద్దిగా నీరు కలిపి చిక్కగా చేసి ఈ టొమాటోల మీద పోసి కలిపి మూతపెట్టి, మంట తగ్గించాలి. నూనె తేలేవరకు ఉడికించి, కొత్తిమీర తో గార్నిష్ చేయాలి.