తోటకూర పులుసు కూర:

కావలసిన వస్తువులు:

తోటకూర - 2 కట్టలు

పెద్ద ఉల్లిపాయలు - 2

టమోటాలు - 2

చింతపండు గుజ్జు - 2 చెంచాలు

కారం - చెంచాడు

ఉప్పు - తగినంత

పచ్చిమిర్చి - తగినన్ని ముక్కలు

తాలింపు గింజలు - తగినన్ని


తయారు చేసే విధానం:

ముందు తోటకూరను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సన్నాగా తరిగి ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలను కూడా తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో తాలింపు వేసి ముందుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగిన తర్వాత తోటకూర తరుగు వేసుకుని చింతపండు గుజ్జు, ఉప్పు కారం వేసి గ్లాసు నీరు పోసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర వేసి దింపేయాలి. అంతే మీరు ఎంతగానో ఇష్టపడే తోటకూర పులుసు కూర సిద్ధం.