తోటకూర , సొరకాయ కూర:

కావలసిన వస్తువులు:

సొరకాయ - 1 కప్పు ముక్కలు

తోటకూర - 2 కట్టలు

చింతపండు గుజ్జు - 2 చెంచాలు

కారం - చెంచాడు

టమోటా - కప్పు ముక్కలు

ఉల్లిపాయ - కప్పు ముక్కలు

ఉప్పు - తగినంత


తయారు చేసే విధానం:

ముందుగా తోట కూర తరిగి సిద్ధం చేసుకోవాలి. తరిగిన కూరను తిరగమోత వేయాలి. అందులో సొరకాయ, టమోటా, పచ్చి మిరప, ఉల్లి ముక్కలు వేసి బాగా ఉడికించాలి. మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు, కారం, ఉప్పు వేసి సన్నని సెగపై ఉడకనియ్యాలి. మెత్తగా ఉడికిన తర్వాత దించేసి దానికి ఓ చెంచాడు నేయిని కలిపి వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.