చిక్కుడుకాయ టమోటా కూర:

కావలసిన వస్తువులు:

చిక్కుడు కాయలు - 1/2 కిలో

ఉల్లిపాయలు - 2

టమోటాలు - 2

నూనె - 6 స్పూన్లు

ఉప్పు, కారం, పసుపు - తగినంత

ఎండు మిర్చి - 2

శనగపప్పు - 1 స్పూను

మినపప్పు - 1 స్పూను

కొత్తిమీర - 1 కట్ట

కరివేపాకు - 2 రెబ్బలు

ఆవాలు - 1/2 స్పూను

పచ్చిమిర్చి - 4

జీలకర్ర - 1 స్పూను


తయారు చేసే విధానం:

చిక్కుడుకాయలు కడిగి ఈనలు తీసి ముక్కలు చేసి, ఉల్లి, టమోటా కూడా కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఉల్లిముక్కలు వేసి వేగాక చిక్కుడు, టమోటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి 1 కప్పు నీళ్ళు పోసి సన్న సెగమీద ఉంచి మగ్గిన తరువాత దించుక్కోవాలి. (అలాగే టమోటాలు బదులుగా వంకాయ కూడా చిక్కుడు కాయలతో కలిపి వండుకోవచ్చు.