ఎగ్ చాట్ :

కావలసినవి:

ఉడికించిన గుడ్లు - ఐదు,

ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి),

టొమాటో - ఒకటి (సన్నగా తరిగి),

మొలకెత్తిన గింజలు - పావు కప్పు,

బంగాళాదుంప - ఒకటి,

కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,

గ్రీన్ చట్నీ - ఒక టీస్పూన్,

చింతపండు చట్నీ - ఒకటిన్నరటేబుల్ స్పూన్,

పచ్చిమిర్చి- మూడు (సన్నగా తరిగి),

కారం - అర టీస్పూన్,

ఉప్పు - రుచికి సరిపడా.


తయారీ:

గుడ్లను చిన్న ముక్కలుగా కోయాలి.

బంగాళాదుంపని ఉడికించి పొట్టు తీసి పొడిపొడిగా నలపాలి.

కొత్తిమీర మినహాయించి మిగతా పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.

దీనిపైన కొత్తిమీరను అలంకరించి తినేయాలి.